నమ్మదగిన దేవుని వెంబడించిన నమ్మకత్వము కలిగి జీవించిన ఎపుడు నిన్ను విడిచిపెట్టడు సాతాను నిన్ను ముట్టడు. (2) 1.యోసేపును ఆపదలో రక్షించెను ఫలియించెడి కొమ్మగ హెచ్చించెను. (2) ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు తనతో రమ్మని నిన్ను అడుగుచున్నాడు. (2) ||నమ్మదగిన|| 2.దావీదును రాజుగా అభిషేకించెను ప్రియమైన సేవకునిగ రూపించెను. (2) ||ఆ దేవుడే|| 3.మోషేను నాయకునిగ నియమించెను తన ప్రజలకు దీవెనకరముగ నుంచెను. (2) ||ఆ దేవుడే||