అయ్యా!సిమ్మన్న గారు మీ డిపార్ట్మెంట్ లో"పర్వతనేని"ఇంటి పేరుతో ఒక ప్రొఫెసర్ ఉన్నారు గదా!ఆ పెద్ద మనిషి నిర్లజ్జగా శ్రీ నాగార్జున యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ క్లాస్ లో "21డేస్ రిప్రష్డ్ కోర్సులో"దంత్య తాలవ్యాలకు సంబంధించిన సూత్రాలు "చిన్నయ్య సూరి తప్పు గా చెప్పాడని,వేరే వారి గ్రంథము నుండి "కాపీ "చేసినాడని కారుకూతలు కూసినాడు.జష్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కొరకు.
@puttaguntalakshmikumari Жыл бұрын
సంస్కృత భాష లో మంచి పట్టు ఉంటేనే బాలవ్యాకరణము బోధపడుతుంది.భారతం అని వ్రాసేవారికి వ్యాకరణము ఎట్లాబోధపడుతుంది.కేవలము యూనివర్శిటీ లే వ్యాకరణానికి మంగళం పాడారు.సెమిష్టర్ సిస్టమ్ లో రెండు నెలలో బాల,ప్రౌఢ వ్యాకరణాలు ఎంత చక్కగా చెప్పగలరు.బి.ఏ లో స్పెషల్ తెలుగు ప్రవేశ పెట్టటముతో వ్యాకరణము క్రమేపీ కనుమరుగైపోయింది.వాడుక భాష, పత్రికల భాషలో పాఠాలు ప్రవేశపెట్టి "బ్రాహ్మణ భాష, బ్రాహ్మణ సాహిత్యంము "అనే పేర్లు పెట్టి విద్యార్థులుకు వ్యాకరణము ను క్రమేపీ దూరము చేసినారు.పదాంతం లో సున్న(0)తో వ్రాసే వారికి సంధి సూత్రాలు ఎట్లా అన్వయము చేయగలరు.అయ్యా! యూనివర్శిటీ లో బహుకాలము పని చేసి మీరు పదాంతములో("0) లేకుండా అచ్చు వేయుటకు ఎంత ప్రయత్నం చేసినారు.సంస్కృతమును పాఠశాలలో తొలగించి వ్యాకరణము ను పూర్తిస్థాయిలో చెప్పగలరు.
@mohanreddyaaleti3587 Жыл бұрын
సూత్రంలోని అంతట -అనే పదం స్త్రీలింగ శబ్దాలకే వర్తిస్తుంది. స్త్రీసమాలకు ( అచ్చిక 2 ) వర్తించదు . కాబట్టి చిగురు అనే స్త్రీసమానికి ప్రస్తుతసూత్రంచే వు ప్రత్యయం రాగా, 57 చే అది లోపిస్తుంది అని గ్రహించాలి. అంతట అనేది స్త్రీసమాలకు కూడ వర్తిస్తుందని ఎక్కడో చెప్పాను. నాకు జ్ఞాపకం లేదు.అది తప్పుగా చెప్పాను .