నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను - నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును ||నూతన|| 1.శాశ్వతమైనది నీదు ప్రేమ - ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా -నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి|| 2.ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||
@KadiyamEstherАй бұрын
ఏలె ఏలెలో ఏలె ఏలెలో చిత్రాలు చిత్రాలు అన్ని విచిత్రాలు మారని లోకంలో దేవున్నీ మార్చేస్తున్నారు (2) ధనమే దైవమని మనిషే దేవుడని దైవాన్ని మార్చేస్తున్నారు ఈ మనుషులు నింగిని మార్చలేరు నేలను చేయలేరు మరణాన్ని తప్పించుకొని బ్రతకలేని మనుషులు చరణం వానకు రంగులు వేయగలమా గాలికి రూపం ఇవ్వగలమా తండ్రిని మనము మార్చగలమా దేవుని రూపాన్ని గీయగలమా (2) చూడని దేవుని మార్చేయ గలమా చుక్కలు చేసిన దేవుని లెక్కలు తెలుసునా ఈ విశ్వం చేసిన దేవుని కొలత తెలుసునా చేసావేలా దేవున్నిమార్చేవెలా ఎలా దైవాన్ని చరణం రుచికి రూపమేదో మనిషికి తెలిసినా శబ్దానికి ఆకారం కనిపించదుగా దేవుని రూపమంటే గుణమే తెలుసునా గుణముకు రూపాన్ని ఇవ్వగలమా (2) మనిషిని చేసిన దేవుడు ఆత్మని తెలుసునా సత్యము ప్రేమ దేవుని రూపం తెలుసునా నీతి న్యాయం దైవాకారం తెలుసునా చెయలేవు దైవ రూపాన్ని తెలుసుకో వాస్తవాన్ని
@KadiyamEstherАй бұрын
పల్లవి .చితికిన నా బ్రతుకు మరల చిగురింప చేయుము నలుగుతున్న నాహృదయం చంకెళ్లు తెంచుము./2 కఠినాత్ముల హృదయములను కరిగించే దేవుడవు. నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు.. కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను కరుణచూపి కాపాడవ మునిగిపోతున్నాను.. (పల్లవి) వింటున్న వాక్యములు పదునైనవి నేను చేయు గాయములు ఘోరమైనవి.. నే వింటున్న వాక్యములు బలమైనవీ బండభారే నా హృదయం పగులుచున్నది..//2 నలికి కుమిలిపోతున్న ప్రభువా.. ప్రార్థించ లేకున్నా దేవా. మూగబోయే నా స్వరమును తట్టి.. ప్రార్థించే ధైర్యము నాకిమ్ము.. //2 ఈ మాయలోక మంత్రములకు మారిపోతిని పాపమనే ఊబిలోని మునిగిపోతిని.. అపవాది ఎత్తుగెడకు చిక్కిపోతినీ. తుదకు నన్ను నేనే నమ్మి మోసపోతిని. //2 దేవా నీ హస్తముతో ముట్టీ.. పరిశుద్ధుల వరసులో నన్నుంచుము. నా పాపము దోషములను తుడిచీ.. మీ ఆత్మతో నన్ను శుద్ది చేయి దేవా //2 ( చితికిన నా బ్రతుకు
@churchofthelivinggod-honga3924Ай бұрын
ఆరంభమయింది Restoration నా జీవితంలోన New sensation నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం, నా ప్రభువు సమకూర్చి దీవించులే! మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే! హే! మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration || హే! రెండంతలు, నాల్గంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration || 1. మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను అరె! సాయంకాలమున ఏడ్పు వచ్చిననూ ఉదయం కలుగును నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును కీడు తొలగజేయును, మేలు కలుగజేయును 2. మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును చీడపురుగులెన్నియో తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును అరె! నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను అది తప్పక జరుగును, కడవరి వర్షమొచ్చును క్రొత్త ద్రాక్షారసము, అహా! మంచి ధాన్యములతో మా కొట్లు నింపును క్రొత్త తైలమిచ్చును, మా కొరత తీర్చును 3. పక్షిరాజు వలెను మా యౌవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును మేం కోల్పోయిన యౌవన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును అరె! వంద ఏళ్ళు అయినా, మా బలము ఉడగకుండా సారమిచ్చును జీవ ఊటనిచ్చును, జీవ జలములిచ్చును సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును ఆత్మవాక్కులిచ్చును, మంచి దృష్టినిచ్చును 4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పికొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును అరె! అంధకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో మమ్ము గొప్పజేయును, దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును మహిమ కుమ్మరించును, మెప్పు ఘనతలిచ్చును 5. మా జీవితాలలో దైవ చిత్తమంతయూ మేము చేయునట్లు కృపనిచ్చును సర్వలోకమంతట సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును అరె! అపవాది క్రియలు మేం లయము చేయునట్లు అభిషేకమిచ్చును ఆత్మ రోషమిచ్చును, కొత్త ఊపు తెచ్చును మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును సత్యబోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును
@KadiyamEstherАй бұрын
: మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును చరణం 1: ప్రభువే నా సర్వమని పలికితివి నీవు ప్రాణమైన అర్పించెద అంటివి ఆనాడు ప్రభువే నా సర్వమని పలికితివి నీవు ప్రాణమైన అర్పించెద అంటివి ఆనాడు చులకనాయెనా క్రీస్తు ప్రేమ ఈనాడు చులకనాయెనా క్రీస్తు ప్రేమ ఈనాడు మోసపోకుమా దేవుడు వెక్కిరించబడడు మోసపోకుమా దేవుడు వెక్కిరించబడడు యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును చరణం 2: మనుజులెల్ల మరచిన మరువని నీ దేవుడు మరణము పైబడినను తప్పించెను కాదా మనుజులెల్ల మరచిన మరువని నీ దేవుడు మరణము పైబడినను తప్పించెను కాదా రక్షణ నిర్లక్షపెట్టి లోకముకై పరుగేల రక్షణ నిర్లక్షపెట్టి లోకముకై పరుగేల ప్రభువు చేయి విడచిన నీగతి ఏమౌను ప్రభువు చేయి విడచిన నీగతి ఏమౌను యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును చరణం 3: లోకము దాని ఆశయు గతియించిపోవును ప్రభువు చిత్తం నేరవేర్చిన నిలిచెదవు నీవు లోకము దాని ఆశయు గతియించిపోవును ప్రభువు చిత్తం నేరవేర్చిన నిలిచెదవు నీవు మొదటి ప్రేమ రగిలించి మారుమనస్సు పొందుము మొదటి ప్రేమ రగిలించి మారుమనస్సు పొందుము లేనియెడల లోకమే నిన్ను కాల్చివేయును లేనియెడల లోకమే నిన్ను కాల్చివేయును యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా యోచించుము సోదరా యోచించుము సోదరి నాగటిపై చేయిపెట్టి వెనుదిరిగెదవా మరచితివేలా నీ మొదటి ప్రేమను విడిచితివేలా నీ విశ్వాసమును
@churchofthelivinggod-honga3924Ай бұрын
పల్లవి: విత్తనం విరుగకపోతే - ఫలించునా కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా (2) శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వానమే నా బలం (2) ( విత్తనం) 1 పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే- ఇస్తాడు విజయ కిరీటం గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? (2) {శ్రమలే} 2 సేవించే మా(మహా)దేవుడు - రక్షించక మానునా రక్షించక పోయిన సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2) అగ్నిలో ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2) {శ్రమలే} 3 ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2) వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2) [శ్రమలే}
@KadiyamEstherАй бұрын
అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ నీ దివ్య సన్నిది చాలునయ నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములలో నే నడచుటకు మరపురాని మనుజాశాలను విడిచి మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే
@KadiyamEstherАй бұрын
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం (2) గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో - నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా - అవి నీ పాదముల క్రిందనే (2) వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥ ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే
@churchofthelivinggod-honga3924Ай бұрын
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
@KadiyamEstherАй бұрын
కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2) స్తుతి స్తుతి శ్రీ యేసు నామం - స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం - ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం - స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం - ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా - యేసే తోడుగా మాతో నడువగా - భయమే లేదుగా ||స్తుతి|| క్రీస్తుని వేడగా - మార్గం తానేగా సత్యం రూఢిగా - జీవం నీయగా ||స్తుతి||
@KadiyamEstherАй бұрын
ఇంటిపైన స్టారు - ఇంటిలోన బారు - (ఇది కానే కాదు - నిజ క్రిస్మస్ పండుగ)2 (నీ హృదిలో ప్రభు యేసు జన్మిస్తేనే)2 -(అప్పుడే అవుతుంది - నిజ క్రిస్మస్ పండుగ)2 1. దేవుడే మనువునిగా వచినవేళా, సత్రమే రక్షకుని త్రోసిన వేళా పశువుల పాక ప్రభుని చేర్చుకోగ, పున్యక్షేత్రముగా మరీనా వేళా ఈ క్రిస్మస్ వేల నీవు క్రీస్తుని త్రోసివేసి సత్రమా? లేదా క్రిస్మస్ వేల నీవు క్రీస్తుని చేర్చుకొనే పాకవా? నేడే రక్షకుని చేర్చుకొ (అప్పుడే అంబరాన్ని అంటుతుంది సంబరం)-2 2. తూర్పు జ్ఞానులు వెదకిన వేళా, తారాయే రక్షకుని చుపినవేళా రాజగు హేరోదు వణికిన వేళా, యేసునే హాని చేయ జూచిన వేళా ఈ క్రిస్మస్ వేళా నీవు క్రీస్తుని పూజించే జ్ఞానివా? లేదా క్రిస్మస్ వేళా నీవు క్రీస్తుని హాని చేసే రాజువా? నేడే రక్షకుని కలసుకో (అప్పుడే అంబరాన్ని అంటుతుంది సంబరం)2.
@KadiyamEstherАй бұрын
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం - (2) ||కోటి కాంతుల|| రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే - (2) ||కోటి కాంతుల|| మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2) ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే - (2) ||కోటి కాంతుల||.
@KadiyamEstherАй бұрын
అసలైన క్రిస్మస్ మన జీవితమే ఆరాధన అంటే జీవన విధానమే క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే ఇంటా బయట క్రీస్తును ప్రతిబింబించడమే క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే ఏదేమైన దేవుని చిత్తం చేయడమే మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన క్రిస్మస్ తారను చూడు వెదజల్లే వెలుగును చూడు జ్ఞానులకే మార్గము చూపిన దేవుని జ్ఞానం చూడు దేవుని కొసం వెలిగే తారవు నీవైతే క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనదా ఇదియే ఆరాధన నిజ క్రిస్మస్ ఆరాధన పశువుల తొట్టెను చూడు పవళించిన క్రీస్తును చూడు ప్రజలందరిని రక్షించుటకై దాసుని రూపము చూడు క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా ఇదియే ఆరాధన నిజ క్రిస్మస్ ఆరాధన గొల్లలు జ్ఞానులు చూడు శుభవార్తను నమ్మిరి చూడు యేసును చూసే ఆశను కలిగి ముందుకు సాగిరి చూడు యేసుని చూసే ఆశను కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నిశ్చయముగ దర్శించునుగా ఇదియే ఆరాధన నిజ క్రిస్మస్ ఆరాధన.