Рет қаралды 111
అమెరికాదేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన అదానీపై లంచం కేసు నమోదయింది.భారతదేశంలోలా కాకుండా అమెరికాలో జాప్యం చేయకుండా కేసులను త్వరగా పూర్తి చేస్తారు.అదానీ అవినీతి పర్వం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పడి ఢిల్లీ దాకా పాకింది.అదాని మోడీకి కుడి భుజం లాంటివాడు. అతనిపై అమెరికాలో కేసు నమోదు అయింది.అమెరికాలో ఆదానీపై నమోదైన కేసు ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును అమెరికన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుందా లేక ఆదానికి మద్దతుగా మోడీ అడ్డంపడతారా వేచి చూడాలి. అమెరికా ప్రభుత్వం ఆదానీపై చర్య తీసుకుంటే అమెరికా నిజాయితీ నిలబడుతుంది.ఈ కేసుకు మోడీ అడ్డుపడకుండా ఉంటే మోడీకి స్వచ్ఛత వస్తుంది. అమెరికా ప్రభుత్వం,మోడీ కుమ్మక్కై ఈ అవినీతి కేసును రూపుమాపాలని ప్రయత్నించడం సరికాదు.ఈ కేసు సత్వర పరిష్కారానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రావాలని కోరుతున్నాం.ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ,ఆర్థిక అవినీతికి మూల కారణం అమెరికానా?అమెరికా నుండి ఆంధ్రప్రదేశ్ కు అవినీతి అంటే ఆశ్చర్యంగా ఉంది.కేవలం రూ.1750 కోట్ల అవినీతికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు లక్ష కోట్ల మూల్యం చెల్లించాలా? ఆదానీని శిక్షించే శక్తి మోడీకి ఉందా? ఆదానిని శిక్షిస్తే మోడీ పడిపోవడం ఖాయం.ఇంత అవినీతికి కారకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఆదానికి సపోర్టుగా ఉన్నది ప్రధాని మోడీగా ఆరోపణలు ఉన్నాయి.అదానీ అవినీతికి మూల కారణం కాగా, బలయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజకీయ,ఆర్థిక అవినీతికి ఆదాని స్కాం పరాకాష్ట.దీనిపై సమగ్ర విచారణ జరిపి అదానీని, ఇందుకు బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
Please contact: 9652838631.
Telugunaadu Broadcasting Private Limited,
4/2, Arundalpet, GUNTUR-522002.