Рет қаралды 2,432
అక్షయతృతీయ & శ్రీ రాజశ్యామలా జయంతి
నిత్య ఐశ్వర్యము, సిరి సంపదలు, శుభములు, జయములను ప్రసాదించే
శ్రీ స్వర్ణ కుబేర హోమము &
108 పవిత్ర శ్రీ యంత్రముల పూజ
ఉదయం 10:00 గం నుండి 12:00 గం వరకు
శ్లో|| అఖండైశ్వర్య దాతారం శుభకళ్యాణ దాయకం |
దేవం స్వర్ణ కుబేరం తం యక్షరాజం నమామ్యహం ||
శ్రీ ప్లవనామ సంవత్సర వైశాఖ మాస శుక్ల తదియ అతి విశిష్టమైన అక్షయ తృతీయ పర్వదినమును పురస్కరించుకొని శుక్రవారము ఉదయం 10:00 గం నుండి 12:00 గం వరకు శ్రీ శక్తిపీఠ మహాక్షేత్ర ప్రాంగణంలో భారతదేశములోని తొలి స్వర్ణకుబేర స్వామి ఆలయములో అఖండ ఐశ్వర్యమును, సిరిసంపదలను, శుభములను కలిగించే శ్రీ స్వర్ణ కుబేర స్వామికి, 108 శ్రీ యంత్రములకు ప్రత్యేక పూజ, శ్రీ కమలాత్మికా సహిత స్వర్ణకుబేర హోమము జరుగును.
అధికారము, వశీకరణ శక్తిని, లలిత కళలను ప్రసాదించే
శ్రీ రాజశ్యామలా హోమము
సాయంకాలం 5:30 గం నుండి 7:30 గం వరకు
శ్లో|| అధికార మహాశక్తి వశీకరణ దాయినీం |
జయంకరీం రాజ్యదాత్రీం మాతంగీం ప్రణమామ్యహం ||
ఆనాడు దశమహావిద్యలలోని శ్రీ రాజశ్యామలా(మాతంగీ)దేవి జయంతి సందర్భంగా సాయంకాలం 5:30 గం నుండి 7:30 గం వరకు అధికారమును, వశీకరణ శక్తిని, విజయమును ప్రసాదించే శ్రీ రాజశ్యామలా దేవి పూజ, అమ్మవారికి ప్రీతికరమైన ద్రవ్యములతో హోమము జరుగును.
పరమ పూజ్యులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్యాశీస్సులతో, ప్రత్యక్ష సమక్షంలో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహత్తర కార్యక్రమముల ద్వారా భక్తులు శ్రీ రాజశ్యామలా దేవి, శ్రీ స్వర్ణకుబేర స్వామి దేవతల అనుగ్రహమును పొందగలరు.
గమనిక: అక్షయ తృతీయ శుక్రవారం నాడు శ్రీ స్వర్ణ కుబేర సమక్షంలో పూజించబడిన శ్రీ యంత్రముల కోసం ముందుగా సంప్రదించగలరు.
ఈ మహత్తర కార్యక్రమముల వివరముల కోసం సంప్రదించవలసిన నెంబర్లు
8639466355 9160455255 9490428387 8977788055