Akasamlo Meghame (ఆకాశంలో మేఘమే) | Lyrical Song - 124 | Jyeshta Pournami Spl

  Рет қаралды 55,126

Gnanavaahini channel

Gnanavaahini channel

Күн бұрын

దేవుడు మనిషివలె వచ్చి, దేవుడే మారురూపములో గుర్తించనట్లు మనుషుల మధ్యలోవుండి, దేవుని సమాచారమును (జ్ఞానమును) దేవుడే స్వయముగా చెప్పిపోయినా, ఆ జ్ఞానమును చూచి కూడా ఇది సాధారణ మనుషులు చెప్పు జ్ఞానము కాదని తెలియలేక, భగవంతున్ని కూడా సామాన్య మనుషులలోనికి కలిపివేసుకొంటున్నారు. ఆయన వచ్చిపోయాడను విషయము కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఎవరికీ తెలియని దేవుని సమాచారమును అందించినవాడే నిజమైన దూత అని తెలియక పోయినందున, దేవుడు తన జ్ఞానమును భూమిమీద మనుషులకు అందించు మూడు విధానములలో, మూడవ విధానమైన దూత ద్వారా జ్ఞానమును తెలియజేస్తాను అన్న విధానమును పూర్తి తెలియకుండా పోయారు.
మూడు విధానములలో రెండవదైన తెరచాటునుండి తెలియజేస్తాను అను పద్ధతి ప్రకారము తెరచాటునుండి ఎలా తెలియజేస్తాడో తెలియనివారై, తెరచాటు నుండి కనిపించక చెప్పినప్పుడు అలా చెప్పిన వానిని దేవుడు పంపిన దూతయని అనుకోవడము జరిగినది. మూడవ విధానమును రెండవ విధానముగా మనుషులు అనుకోవడము జరిగినది. ఇకపోతే మొదటి విధానమైన ఆకాశవాణినుండి చెప్పబడునది ఎలాగో కూడా మనుషులకు తెలియకుండా పోయినది. ఒకమారు సృష్ట్యాదిలోనే దేవుడు ఆకాశము నుండి సూర్యునికి తన జ్ఞానమును చెప్పించినా, అదే జ్ఞానమును సూర్యుడు తన సాటి గ్రహములకు, భూమిమీదవున్న ప్రజలకు తెలియజేసినా, దేవుడు చెప్పినట్లు రెండు విధానములు గడచిపోయాయని తెలియలేకపోయారు. సృష్ట్యాదిలో మొదటి విధానము జరుగగా, అప్పుడే కొద్ది కాలమునకు సూర్యుడు రెండవ విధానము ప్రకారము భూమిమీద మనుషులకు జ్ఞానమును తెలియజేసాడని గుర్తించలేకపోయారు.
నేటికైనా, సృష్టి ఆదినుండి దేవుని జ్ఞానము మూడు విధములుగా ఎలా తెలుపబడుతూ వచ్చిందో ! అను అంశమును "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల" వారిచే రచియింపబడ్డ ఆధ్యాత్మిక గ్రంథములలో చదివి "త్రైత సిద్ధాంత చరిత్ర"ను తెలుసుకోండి !!!
www.thraithash...
TEAM:
----
Lyricist - Siva Krishna Kogili
Singer - Nandhini Chaitanya
Music - N R Chaitanya Kumar
Editing - Sai Songa
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
LYRICS:
---------
సాకీ:
దేవుని జ్ఞానం దేవునికే తెలిసేను
ఆ దేవుని వాక్యం దేవుడే తెలిపేను
దైవబోధ భువిపై మూడు విధములుగానే చేరేను
ఆ దైవవాణి జీవిపై మూడు ఆత్మలుగానే నిలిచి తీరేను
పల్లవి :
ఆకాశంలో మేఘమే ఒక ఉరుమై ఉరిమింది
ఆ ధ్వనిలోని జ్ఞానమే ఆదిత్యుని కందింది
అదే తను మనువుకు తెలిపింది
అదే ఇక్ష్వాకుని చేరింది అలా ప్రజలందున పాకింది
ఆకాశంలో మేఘమే ఒక ఉరుమై ఉరిమింది
ఆ ధ్వనిలోని జ్ఞానమే ఆదిత్యుని కందింది
చరణము 1:
సృష్టి ఆదిలో సృష్టి కర్తయే ఆత్మ రూపు దాల్చి
సంపుర్ణ జ్ఞానము తెలుపంగా ఆకాశవాణిగ పలికాడు
పుట్టినట్టి ఆ సృష్టికన్న అది వేరుగున్న జ్ఞానం
జపర అని పేరును దాల్చింది జగతిలో వ్యాపించేసింది
అజ్ఞానంతో జీవులే నిజ జ్ఞానము మరిచారు
అధర్మాలు చెలరేగగా ఆ మాయలో పడ్డారు
కనుక పరమాత్మే కృష్ణునిగా ద్వాపరమునందున వెలిశాడు
తిరిగి తన గీతను బోధించి ధర్మ సంస్థాపన చేశాడు
ఆ దైవములో అంశమే అవతారము దాల్చింది
పరమాత్మునిలో భాగమే భగవానుగ వెలిసింది
అదే తన గీతను గీసింది అదే కౌంతేయునికందింది
అదే ఆ వ్యాసుడు రాసింది .....
ఆ దైవములో అంశమే అవతారము దాల్చింది
పరమాత్మునిలో భాగమే భగవానుగ వెలిసింది..!
చరణము 2:
కలియుగమ్ములో కన్య గర్బమున ఏసుక్రీస్తు పుట్టి
పరలోకమొందే మార్గాన్ని సువార్తగ మనకందించాడు
ఖగోళాన ఒక గ్రహము అయిన ఆ జిబ్రయేలు దూత
తిరిగి ఆ దేవుని జ్ఞానాన్నే ఖురానుగ ప్రవక్తకిచ్చాడు
దైవభావమును జీవులే గ్రహియించక పోయారు
ఒకే పథమునే వేరు వేరు మతములుగా మార్చారు
కనుక ఆనందుడు వెలిశాడు త్రైత సిద్ధాంతము తెలిపాడు
మతమునే మాయగ చాటాడు పరమాత్మ పథమును చూపాడు
కరుణామయుని వాక్యమే కలియోగము నిచ్చింది
ఆ కలిలోని గ్రంథినే ఆఖరుగా తెచ్చింది
అదే ఆదరణను చూపింది ఆనంద గురువై వచ్చింది
ఆది సిద్ధాంతము చాటింది ....
కరుణామయుని వాక్యమే కలియోగము నిచ్చింది
ఆ కలిలోని గ్రంథినే ఆఖరుగా తెచ్చింది
చరణము 3:
మూడు విధములా బోధజేయుటకు పూనుకున్న దైవం
మనిషికీ దూతగ బోధించి ప్రవక్తకు తెరమరుగైనాడు
మూడు మారుగా అవతరించు సంపూర్ణ బోధ కోసం
మహా భూతముగా శిష్యునికే మహిలోన గురువై పలికాడు
మధ్యాత్మంటూ మాయగా సిద్ధాంతము చేర్చాడు
హృధ్యాంతాన చాటుగా హద్దులనే కూల్చాడు
శ్రద్ధ సంపూర్ణము గావించి బుద్ధితెర ధ్వంసము చేసాడు
గురువుకే మూసను ముద్రించి సమాధిన జీవము పోసాడు
ఆకాశంలో మేఘమే ఒక మాటను పలికింది
ఆ మాటే ఒక మూటగా మూడాత్మలనిచ్చింది
అదే తౌరాతుగ మారింది ... అదే ఇంజీలుగ చేరింది
అదే ఖురానుగ నిలిచింది
ఆకాశంలో దైవమే ఒక మాటను పలికింది
ఆ మాటే ఒక మూటగా మూడాత్మలనిచ్చింది ... మూడాత్మలనిచ్చింది ... మూడాత్మలనిచ్చింది

Пікірлер
Sri Krishna paripurna avatar full video by Sri chaganti garu
1:38:22
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 12 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 79 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
30 June 2023
10:05
Sasumana lakshmu naidu
Рет қаралды 439 М.
Prapacha Shradda-Paramthma Shradda_19-03-2011 | thraitha siddantham
55:43
Thraitha Siddantham
Рет қаралды 64 М.
Srichakraraja Simhasaneswari | Navaratri 2024 | Bhargavi Venkatram
6:18
Bhargavi Venkatram Udupa
Рет қаралды 24 М.
Garikapati Narasimha Rao latest speech about Dharma of rama and Krishna.
19:41
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 481 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 12 МЛН