Рет қаралды 1,631,398
ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాగీతము
Dwadasa Jyotirlinga visuals song
Shambho Mahadeva (Anandashiva Tandavagitam) #shivabhaktisongs #drusyakavitalu
Lyrics & Designing : Lanka Venkata Narasimha Rao
Composing & Singer : K Anil Kumar
Sound Editing : G Umamahesh
Recorded at : Yuvan Recording Studio, Vijayawada +91 9866411599
శంభోమహాదేవ
రచన : లంకా వేంకట నరసింహారావు
శంభో మహాదేవ శంభో మహదేవ
శాంభవీహృదయేశ ఓంశంకరా||
కైలాసాధీశ కైమోడ్చితిని ఈశ
కాశికాపురవాస కామ్యఫలకలశ
కామాక్షిహృదయేశ కరుణాకరేశ
కలికల్మషకనాశ కాళహస్తీశ
నీ దాసాదాసుడనే నీవైపు ధ్యాస
నాలోని ప్రతిశ్వాస నీవేను ఆశ
నిన్నున్నమ్మితి మనస నిర్మలాకాశా
నిశ్చితానందీశ నిఖిలేశ్వరేశ
మముగావగారావ మనసున్నమల్లేశ
గండాలు తప్పింప గరళకంఠేశ
ఆనందతాండవా అరుణాచలేశా
పిలిచినంతనే పలుకు పరమజ్ఞానేశ
శంభో మహాదేవ శంభో మహదేవ
శాంభవీహృదయేశ ఓంశంకరా||