Рет қаралды 51,564
పట్టుదల, క్రమశిక్షణ, ధృఢసంకల్పం తోడుంటే... అసాధారణ లక్ష్యాలనైనా సునాయాసంగా సాధించే తెగువ సొంతమవుతుంది. జీవితం వడ్డించిన విస్తరికాదన్న స్పృహ... వ్యక్తి వికాసానికి దివిటీలా నిలుస్తుంది. మనుగడ సాగించాలంటే పోరాటం అనివార్యమైన సంఘర్షణలో విద్య.. అసమానతలు, ఆర్థిక అంతరాల గుట్టువిప్పే పాశుపతాస్త్రంగా మారుతోంది. అంత కీలకమైన సామాజిక వివక్ష రూపుమాపే ఆశయసాధనలో దళితులు, గిరిజనులు, వెనకబడ్డ వర్గాల జీవితాల్లో.. సంక్షేమ గురుకులాలు విద్యా వెన్నెలలు కురిపిస్తున్నాయి. మహనీయుల జీవితాలు ఆదర్శంగా వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నాయి. విద్య ఖరీదైన సరకుగా మారి పోయిన పరిస్థితుల్లో సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను నాణ్యమైన విద్యకు చిరునామాగా మార్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తో ఈటీవీ ముఖాముఖి.
----------------------------------------------------------------------------------------------
☛ Download ETV Android App: goo.gl/aub2D9
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelanganaa
☛ Circle us : goo.gl/2UCQkm
-----------------------------------------------------------------------------------------------