Рет қаралды 70,130
శనగపప్పు పాయసం చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని పండగలప్పుడు, ఏదైనా పూజలప్పుడు నైవేద్యంగా చేసుకోవచ్చు. ఇది చేయడం చాలా తేలిక, తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
#kadalaiparuppupayasam #homecookingtelugu #senagapappupayasam #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
Here's the link to this recipe in English: bit.ly/3oa2IDt
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 45 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
శనగపప్పు - 1 కప్పు
పెసరపప్పు - 1 / 2 కప్పు
నీళ్లు
నీళ్లు - 1 కప్పు
బెల్లం - 250 గ్రాములు
నెయ్యి - 1 టేబుల్‌స్పూన్
జీడిపప్పులు - 1 టేబుల్‌స్పూన్
కిస్మిస్లు - 1 టేబుల్‌స్పూన్
కొబ్బరి ముక్కలు - 2 టేబుల్‌స్పూన్లు
శొంఠి పొడి - 1 టీస్పూన్
యాలకుల పొడి - 1 / 2 టీస్పూన్
కొబ్బరి పాలు - 1 కప్పు
తయారుచేసే విధానం:
ముందుగా శనగపప్పు, పెసరపప్పుని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
ఒక గిన్నెలో నీళ్లు పోసి, అందులో బెల్లం వేసి పూర్తిగా కరిగించిన తరువాత పొయ్యి కట్టేయచ్చు
ఒక వెడల్పాటి పాన్‌లో నెయ్యి వేసి, అందులో జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
ఆ తరువాత అదే పాన్‌లో కొబ్బరి ముక్కలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
పప్పు ఉడికిన తరువాత మాష్ చేసి ఉంచాలి
బెల్లం పాకాన్ని వడకట్టి, పాన్‌లో వేసిన తరువాత ఉడికించిన పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి
ఇదంతా బాగా కలిపిన తరువాత శొంఠి పొడి, యాలకుల పొడి వేసి కలిపి, పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి, కొబ్బరి పాలు పోయాలి
ఇదంతా మళ్ళీ కలిపిన తరువాత వేయించిన కొబ్బరి, జీడిపప్పులు, కిస్మిస్లు వేసి కలపాలి
అంతే, శనగపప్పు పాయసం తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZbin: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...