నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
@veenasingireddy55909 ай бұрын
Song is good but. God will give. He will not take back