Рет қаралды 133
తహసిల్దార్ గారు ప్రభుత్వ భూములను కాపాడండి....
CPI పార్టీ విన్నపం
పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ చెరువులు ప్రభుత్వ స్థలాలను కొంతమంది వ్యక్తులు కబ్జాలు చేస్తున్నారని. క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఉన్న డి టి గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగాసిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ. పట్టణ పరిధిలో ఉన్న ఇటువంటి శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యూట్ మిల్, భూముల్లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని దీనిపై గతంలో ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇటువంటి దర్యాప్తు చేయకపోవడం వలన ఆ భూమి ఆక్రమణకు గురైందని. అలాగే ఐటిఐ కాలనీ ప్రభుత్వ స్కూల్ పక్కన ఉన్నటువంటి కొంత ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని. దీనిపై తక్షణమే రెవెన్యూ యంత్రాంగం స్పందించి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఏదైతే ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్నారో ఆ బోర్డులను లెక్కచేయకుండా భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించకపోతే ఏదైతే కబ్జాకు గురైన భూములను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం జరిపి పేదలకు పంచుతామని హెచ్చరించారు. పక్కా ఆధారాలతో రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేసినప్పటికీ ఎమ్మార్వో గారు మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ చెరువులు భూములు కబ్జాలకు గురయ్యాయని. ఇందిరమ్మ కాలనీ భూ కబ్జాలకు అడ్డగా మారిపోయిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్. సిపిఐ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న. సిపిఐ పట్టణ నాయకులు పాలూరి. కృష్ణ. బి తులసి పాల్గొన్నారు