Рет қаралды 10,284
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం రెబల్ స్టార్ కే సొంతం
భీమవరంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలు.. పాల్గొన్న జిల్లా కలెక్టర్, మండలి చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు
భీమవరం : ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం రెబల్ స్టార్ కృష్ణంరాజుకే సొంతమని, ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు అనేది ఆయన సిద్ధాంతమని పలువురు వక్తలు అన్నారు. భీమవరం డిఎన్నార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ యువి కృష్ణంరాజు జయంతి వేడుకలను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పత్సమట్ల ధర్మరాజు, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, తెలంగాణ ఎమ్మెల్యే కెవి రమణ రెడ్డి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, పలువురు ప్రముఖులు కేక్ కట్ చేసి మాట్లాడారు. కృష్ణంరాజు చేసిన పాత్రలే ఆయనకి రెబల్ స్టార్ అనే పేరు తీసుకొచ్చాయని, ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ప్రయాణం సాహసోపేతంగా సాగిందని, భిన్నమైన పాత్రలతో నటుడిగా పరిశ్రమ స్థాయిని పెంచే చిత్రాలతో నిర్మాతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్నారని అన్నారు. అలనాటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలకు దీటుగా తనదైన నటనతో రాణించిన కథానాయకుడు కృష్ణంరాజు అని అన్నారు. ఆయన జయంతి వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో డిఎన్నార్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, టీడీపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, కోళ్ల నాగేశ్వరరావు, డాక్టర్ పిఆర్కే వర్మ, అల్లూరి సాయి దుర్గారాజు, పేరిచర్ల సుభాష్, గోకరాజు పాండు రంగరాజు, జిల్లా ప్రభాస్ ప్యాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, పట్టణ మెగా ప్యాన్స్ అధ్యక్షులు చల్లా రాము, చెనమల్ల చంద్రశేఖర్, పొత్తూరి బాపిరాజు, ఎన్టిఆర్, బాలకృష్ణ ప్యాన్స్ చౌదరి, చెరుకువాడ రంగసాయి, గోకరాజు రామరాజు, డిటీడీసి బాబు, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.