మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రం ను శివ ముక్కోటి అంటారు పాత ప్రకాశం జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా చీరాల & వేటపాలెం ల లో ఈరోజు శివాలయాలలో విశేషంగా రాత్రి 12 గంటలనుండి తెల్ల వారు ఝాము వరకు ఏకాదశ రుద్రాభిషేక ములునిర్వహిoచుచున్నరు. చాలా కాలం క్రితం చిదంబరం క్షేత్రం సమీపంలోని ఒక ద్రావిడ రాజు తుఫాను కారణంగా అనుకోకుండా ఓడ ద్వారా మోటుపల్లి రేవుకు వచ్చాడని,ఆ రోజు శివ ముక్కోటి అని తెలుసుకుని శివాలయం లో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించమని బ్రాహ్మణులని కోరాడు.అందు స్వామివారికి నూనె రాసి వేదినీతి ( Hot Water) తో తలంటి స్నానం (MANGALA SNANAM), పంచామృతములు, పుష్పోదకం, రుద్రాక్ష జలం సుగంధ పరిమళ చందన గంధం, భస్మం, స్వర్ణ & రజిత జలం. ఫల రసం. నారికేళ జలం ఆఖరు నా ఉదయం 4 గంటలకు అన్నాభిషేకం చేస్తారు.