Рет қаралды 364,699
ఉభయకుశలోపరి!
ఎన్నో రోజులుగా ఈ వీడియో పెట్టమని మీలో చాలా మందే అడిగారు, కానీ సమయాభావం వల్ల ఇంత ఆలస్యం అయ్యింది. బుజ్జిబాబు బాగా పాకేస్తున్నాడు ఇల్లంతా. ఇక మీకు తెలిసిందేగా, పొద్దున లేస్తూనే తన వెనకాలే మా పరుగులు. ప్రతి రోజు తన అల్లరి తో మమ్మల్ని ఎంతగానో మురిపిస్తూ, నవ్విస్తూ, కేరింతలు కొడుతూ, అత్త, తాతా, పాపా, బాబు అని ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ ఆనందపరుస్తున్నాడు.
ఏదైతేనేం నాకు ప్రతి రోజు దొరికే కొద్దిపాటి సమయం లో ఈ వీడియో చేస్తూ, ఇలా ఇవాళ మీ ముందుకు తీసుకురాగలిగాను. ఇంతా కష్టపడి మరీ పది నిమిషాలే ఉందేంటి వీడియో అనుకుంటారేమో. అసలు వేడుక మొత్తం నాలుగు కెమెరాలు నాలుగు వైపుల నించి రికార్డు చేయడం వల్ల మొత్తం నాలుగు గంటల వీడియో ఉండే సరికి, అంతా చూసి ఏ వైపు నించి ఏ సీన్ చూపించాలా అని ఎడిటింగ్ చేసి పది నిమిషాలకు కుదించటం అంటే మామూలు విషయం కాదు గా మరి.
సరే, ఈ విశేషాలన్నీ ఇంకో వీడియోలో తీరిగ్గా మాట్లాడుకుందాము. మా పద్ధతులు, మా పూజ విధానం అందులో వివరిస్తాము.
మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాము. నచ్చితే, మరింకేం, Like చేసి, Subscribe చేసేసుకోండి.
ఉంటానూ...
టాటా, బాయ్ బాయ్!