Рет қаралды 5,081
చూడ నరుదాయనమ్మ సొరిది నందరికిని
వేడుకతో వచ్చి సేవించేరు బ్రహ్మాదులు ॥పల్లవి॥
కోరి చంద్రుఁడుదయించ గోకులచంద్రుడు వుట్టె-
నేరీతి నీతఁడు నాతఁ డేమౌదురో
వారిధి కొడుకతఁడు వారిధి యల్లుఁ డీతఁడు
యీరీతి నీతఁడాతని కేలికాయఁ గాని ॥చూడ॥
నల్లని వాఁడీతఁడాయ తెల్లని వాఁడతఁడాయ
యెల్లవారికిఁ జూడ వీరేమౌదురో
అల్లాతఁడే యమృతము అమృతనాథుఁడితఁడు
చల్లనైన హరితోడ సరిగాఁడుఁ గాని ॥చూడ॥
ఆతఁడు పూర్వాద్రిమీఁద నమరెఁ నిందరుఁ జూడ
నీతఁడు శ్రీవేంకటాద్రి నిరవైనాఁడు
యేతుల వుబ్బుసగ్గులు యిలమీఁద నాతనికి
చైతన్యమెప్పు డీతఁడు సింగారవిభుఁడుగాని ॥చూడ॥