Ee Geetalone (ఈ గీతలోనే ఆ గీత సారం) | Lyrical Video Song - 140 | Phalguna Pournami and Holi Spl Song

  Рет қаралды 29,079

Gnanavaahini channel

Gnanavaahini channel

Күн бұрын

శివానందలహరితో శిశిరమునకు వీడ్కోలు చెప్తూ, వసంతానికి స్వాగతం పలుకుతున్న జ్ఞానవాహిని శ్రోతలకు వీక్షకులకు అందరికీ "ఫాల్గుణ పౌర్ణమి" సందర్భముగా శుభాకాంక్షలు.
ఆదిలోనే ఆకాశవాణిగా ఆదిత్యునికి బోధచేయబడిన అదే గీతా సారమునే, తిరిగి ద్వాపరమున భగవానుడైన శ్రీ కృష్ణుడు, భక్తుడైన అర్జునునికి గీతోపదేశం చేయుచూ, జీవుణ్ణి అజ్ఞానములో బంధించునవైన గుణత్రయములను మాయగా పోల్చి, ఆ మిత్రారిషడ్వర్గాలను పూర్తిగా నియంత్రించుకోమని, నిస్త్రైగుణ్యుడవు కమ్మని హితవు పలికాడు. అలా, భగవానుని గీతోపదేశమును పొంది సంపూర్ణ గుణహరుడైన భక్తుడే ఆ "ఫల్గుణుడు". అందుకే అర్జునుని గుర్తుకొరకు "ఫల్గుణా" అంటాము.
ఈ గీతములోని "గురు గీత", "గురు మాట", "గురు శక్తి" అను మూడు పదములనూ కొంత విశ్లేషించినయెడల ఈ విధముగా తెలియుచున్నది. గీత అనగా హద్దు అని అర్థము. భగవద్గీత అనగా భగవంతునిచే గీయబడిన హద్దు. సంపూర్ణ జ్ఞానస్వరూపమైన పరమాత్ముని అంశ, ఈ ధరణిపై జీవదేహములోని అజ్ఞానమును సంపూర్ణముగా తొలగించివేయుటకు, మూడు మార్లుగా రావలసియున్నది. అలా మూడు సార్లు వచ్చినయెడల ఆ భగవానునియొక్క ఒక అవతారము పూర్తి అగునని చెప్పవచ్చును.
ఈ సమాచారమును దేహావరణలోనికి కొంత లోతుగా వివరణ చేసుకున్నయెడల అర్థమగునది ఏమనగా;
గురుగీత : జ్ఞానబోధచేయుటకు పూనుకున్న భగవదాంశ మొదట "భగవంతుని"గా జన్మించి, తన గురుగీతను భక్తునికి అందజేయుచున్నది.
గురుమాట: పిదప తన జ్ఞానమును గ్రహించుకున్న ప్రవీణుని శిరములో, ఆ దైవంశ "ప్రవక్త"గా సంభవించి తన గురుమాటను చిందజేయుచున్నది.
గురుశక్తి: తుదకు ఆ గురుగ్రాహ్యమును పొందిన శిష్యునిలో, ఆ గురాంశ "జ్ఞానశక్తి"గా ఉద్భవించి తన గురుశక్తిని పొందజేయుచున్నది.
కావున మూడు మారుగా వచ్చిన ఆ ఒకే అంశ, గురు శిష్యుల మధ్య రూపాంతరమును చెందుచూ చివరకు "ఒకడే ఇద్దరు"గా మారి ... ఆ ముగ్గురూ ఒక్క శరీర గీత (హద్దు)గా ఏర్పడి, ఆఖరున రూపంమారిన గీతగా తయారయినది.
ఇంతటి మహోత్తరమైన జీవదైవ పరిణామ క్రమమును తనలో నింపుకొని, మనకు దర్శనమిచ్చిన ఈ త్రైతశకమునకు నా సాష్టాంగ దండ ప్రణామములు, అలాగే ఈ శకము ఏర్పడుటకు త్రైత సిద్ధాంతమై వెలసిన ఆ జగద్గురు అంశకు ఇవే మా దశాంగ దండ ప్రణామములు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం !!!
thraithashakam...
thraithashakam...
thraithashakam...
ప్రత్యేకత:
-----
హోళి పండుగ : గుణరంగును వదిలించుకొని, జ్ఞానరంగును పులుముకొనుచున్న జ్ఞానులందరికీ హోళి పండుగ సందర్భముగా శుభాకాంక్షలు.
పాట 140 : నాలుగు వర్ణములైన గుణములను శూణ్యము చేసుకొని, ఐదవతనమును చేర్చుటకు గుర్తు!
TEAM:
----------
Lyrics : Srinath Shresty , Janagam, T.S.
Singer : S.P Radhika , Jammi kunta, T.S.
Music : R.Wilson (Vigna Studios) Warangal.
Editing : DreamWorks Vfx WARANAGAL
Thumbnail Design - Kishore P
Review - Siva Krishna Kogili
Cordination - Gnanavaahini Team
Production - Gnanavaahini
Presented By - Gnanavaahini Channel
LYRICS:
------------
పల్లవి:
------
ఈ గీతలోనే ఆ గీతసారం ..ఈ గీతలోనే నీ త్రైత భావం
త్రైత గట్టు నీ ఙ్ఞానము గుట్టూ ... ఏరు దాటగా యోగము గట్టు //2
ఆ గట్టు చేరు జ్ఞానమివ్వు ..ఆనందా. "పరమానందా !
ఈ గీతలోనే ఆ గీతసారం... ఈ గీతలోనే నీ త్రైత భావం !
చరణం 1:
-------
ఒక గీత గీసి ఆ గీతలోకి ఒక జీవికి ప్రాణము పోసి
ఆ గీతలో దాగిన వివరమునే ఒక భగవద్గీతగ చేసి
ఈ గీతలో ఏముందో ఆగీతలో.. వివరించే..
ఒక గీతా ... అది గురుగీతా
ఆ గీతలోనే ఈ గీతసారం ఈ గీతలోనే నీ త్రైత భావం!
చరణం 2:
-------
ఒక రాత రాసి ఆ రాతలోనే ఇక జీవిత సత్యము నేర్పి
తల రాతను మార్చే త్రైతం నేర్పే స్వధర్మం చెంతకు చేర్చి
నీ మాటలే .. మహిమలై.. స్వధర్మమే వివరించే
ఒక మాటా... అది గురుమాటా
ఆ మాటలోనే ఈ గీతసారం ఈ గీతలోనే నీ త్రైత భావం!
చరణం 3 :
--------
నీ శక్తితో దాల్చిన సృష్టిలోకి ఒక రూపం దరించి వెలిసి
ఈ సృష్టిలో దాగిన రహస్యములు మా దృష్టికి అందగ జేసి
నీ శక్తియే.. ధరణిపై .. ధర్మమై.. విరజిమ్మే .
ఒక శక్తీ.. అది గురుశక్తీ
ఆ శక్తిలోనే ఈ గీతసారం ఈ గీతలోనే నీ త్రైతభావం
త్రైతగట్టు నీ జ్ఞానము గుట్టూ.. ఏరు దాటగా యోగము గట్టూ //2
ఆ గట్టు చేరు జ్ఞాన మివ్వు ... ఆనందా పరమానందా
ఆ గట్టులోనే ఈ గీతసారం.. ఈ గీతలోనే నీ త్రైత భావం
ఈ గీతలోనే ఆ గీతసారం ..ఈ గీతలోనే నీ త్రైత బావం
Theme :
ఈ గీతలోనే (భగవద్గీత) ... ఆ గీతసారం (ఆకాశవాణి)
ఈ గీతలోనే (భగవద్గీత) ... నీ త్రైతభావం (భగవంతుడు)

Пікірлер
Kalige nidhe naaku Kaivalyamu
9:36
ANDHARINOTA ANNAMAYYAH PAATA
Рет қаралды 228
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 12 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,6 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 79 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 12 МЛН