గమనిక:- మన ఛానల్ ఏ ఒక్క హీరోకి సపోర్ట్ కాదు, అలాగే వ్యతిరేకం కాదు. అందరి హీరోల సినిమాలను పక్షపాతం లేకుండా ఒకేలా చూస్తుంది. నాకు సినిమాల మీద ఉన్న ఇష్టంతో అనంతపురములో సినిమా రివ్యూ (పబ్లిక్ టాక్ ) వీడియోస్ గత 3 సంవత్సరాల నుంచి ఒక వైపు చదువుకుంటూ మధ్యాహ్నం భోజనం చేసే టైమ్ లో తినకుండా థియేటర్ల దగ్గరకు నా దగ్గర డబ్బులు లేకపోయినా, నా ఖర్చులకు పెట్టుకున్న డబ్బులతో బస్ ఛార్జీలు పెట్టుకొని మరీ వచ్చి చిన్న సినిమా , పెద్ద సినిమా అని తేడా లేకుండా పబ్లిక్ మరియు ఫ్యాన్స్ దగ్గర రివ్యూ తీసుకొని పబ్లిక్ మరియు ఫ్యాన్స్ ఏమి చెపితే అదే మన ఛానల్ లో పెడుతున్నాను అది మీ అందరికీ తెలుసు. ఇది తెలిసిన మన అందరి హీరోల ఫ్యాన్స్ , పబ్లిక్ నన్ను , మన ఛానల్ ను సపోర్ట్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం నేను భేద భావం చూపిస్తున్నా అని అనుకుంటున్నారు. అలాంటి వారికి నేను ఏమి చెప్పలేను. నన్ను , నేను పడుతున్న కష్టాన్ని చూసి అర్థం చేసుకుని నా ఛానల్ ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క హీరో అభిమానికి , పబ్లిక్ కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఛానల్ లో పెట్టే వీడియోస్ లో హీరోల ఫ్యాన్స్ , పబ్లిక్ మాట్లాడిన మాటలు మంచిగా చెప్పినా , చెడుగా చెప్పినా ఆ మాటలు కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని గమనించాలని నా మనవి. ప్రతి ఒక్క హీరో అభిమాని మరియు పబ్లిక్ మన ఛానల్ ను ఇప్పటి వరకు ఎలా సపోర్టు చేస్తూ వస్తున్నారో ఇక మీదట కూడా అలాగే సపోర్టు చేయండి. మన ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది. 🙏🙏Thanks To All Heroes Fans and Public ( My Subscribers ) for supporting our youtube channel. I need all your support to our channel.