Рет қаралды 718
పల్లవి: గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2)
1. సర్వాధి కారియు - సర్వోన్నతుండైన (2)
మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము (2) || గొఱ్ఱె ||
2. సిద్ధపడెను వధువు - సుప్రకాశము గల (2)
నిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్ (2) || గొఱ్ఱె ||
3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు (2)
గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) || గొఱ్ఱె ||
4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2)
నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు(2) || గొఱ్ఱె ||
5. దేవుని వాక్యమను - నామము గలవాడు (2)
రక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె (2) || గొఱ్ఱె ||
6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువు (2)
పరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్ (2) || గొఱ్ఱె ||
7. శ్రీ యేసు క్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు (2)
వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె (2) || గొఱ్ఱె ||
#dailyjesuswords #hebron