Рет қаралды 3,703
ప్రైవేటు విద్యాసంస్థల ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కాకినాడలో నిన్న (28-12-2024) పదవ తరగతి విద్యార్థుల కొరకు నిర్వహింపబడిన అవగాహనా సదస్సులో పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు పాల్గొని, పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించుకునే విధంగా వారు అనేక విషయములను తెలియజేశారు. జీవితంలో లక్ష్యములను ఏర్పాటు చేసుకొనుట, వాటిని సాధించుట కొరకు ప్రయత్నించుట, ఆ సాధనలో ఒడిదురుకులు ఎదురైతే వాటిని ఎట్లా ఎదుర్కొని, అధిగమించి తమ లక్ష్యం వైపు పురోగమించాలి అనే విషయంపై పూజ గురువుగారు పిల్లలు అందరికీ మార్గనిర్దేశం చేశారు. అనేకమంది మహాపురుషుల జీవితములలోని విషయములను ఉటంకిస్తూ సాగిన పూజ్య గురువుగారి ప్రసంగమును పిల్లలందరూ అత్యంత ఏకాగ్రతతో విన్నారు.
కొన్ని వేలమంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ఒకానొక సమయంలో పిల్లలకు చోటు సరిపోని పరిస్థితి ఏర్పడితే వారిని వేదికపై తన చుట్టూ కూర్చోబెట్టుకుని పూజ్య గురువుగారు ప్రసంగించారు. కొందరు విద్యార్థులకు గురువుగారు మెటీరియల్ కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజ్య గురువుగారు చేసిన ప్రసంగము పట్ల విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
#srichagantivaani #chagantikoteswararaogaru #chagantipravachanam #Chaganti#srichaganti #chagantikoteswararaospeecheslatest #students #ValuesAndEthics #personalitydevelopment #studentmotivation