No video

Guru Naamam !!! (గురు నామమే నా చెంతనుంటే) | Lyrical Song-148 | Aadivaara Guru Pournami Spl Song

  Рет қаралды 22,161

Gnanavaahini channel

Gnanavaahini channel

Ай бұрын

"ఆనంద గురు" పౌర్ణమి శుభాకాంక్షలు !
మునుపు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భముగా వచ్చిన గీతములో పంచాక్షరిని పఠించమని, ఇపుడు గురు పౌర్ణమికి వచ్చిన గీతములో గురు నామమును జపించమని చెప్పుచున్నట్లు కనిపించుచున్న ఈ గీతములను విని, నిజ జ్ఞానమును తెలుసుకోవాలి అనుకొనుచున్న వారికి కొంత సంశయము ఏర్పడవచ్చును. అది ఏమనగా! వేమన యోగి గారు ఒక పద్యములో.. "కార్యము చెప్పువాడు కడగురువు, మంత్రము చెప్పువాడు మధ్యముండు, ఊరకుండు మనువాడు ఉత్తమ గురువు" అని చెప్పగా, మరి ఇక్కడ ఎందుకు మంత్రములను (ప్రణవ మంత్రమును, గురు మంత్రమును) చెప్పుచున్నారు అని ప్రశ్న రావచ్చును.
అయితే ఇక్కడ బోధించి చెప్పుచున్నది మంత్రమును కాదని "తంత్రము"ను అని, ఆ పంచాక్షరీ తంత్రమే ఊరకుండుటకు ఊతమని, ఈ గురునామ తంత్రమే ఊరకుండుటకు అంత్యమని అరుదుగా కొందరు మాత్రమే గ్రహించుకుని ఆచరించుదురు. ఈ ఆచరణ కూడా గురు కృపతో దానంతట అది జరుగవలసినదే కానీ ఎవరూ స్వయముగా చేయలేరు. అందుకే పంచాక్షరి మంత్రమును శ్వాసతో పఠించమన్నాము. గురునామ చింతనము చిత్తమందు నిలుపుకొనమని చెప్పాము. కావున ఇవి నెలకొలుపుకొనవలసినవే కానీ, నడుచుకొనునవి కానీ ఆచరించునవి కానీ కాదు.
అయితే, కొందరికి అసలు ఈ "గురునామం" అంటే ఏమిటి? అను ప్రశ్న రావచ్చును. దానికి సమాధానమును యోచించిన, ఆధ్యాత్మికములో గల ప్రతి సిద్ధాంతానికి కూడా ప్రత్యేక నామాలు ఉంటాయి. అడ్డ నామం, నిలువు నామం వంటి జ్ఞానమిళిత నామాలు మొదలుకొని కొన్ని వందల అజ్ఞాన జనిత నామములు కూడా మాయావశమున నేడు తయారైపోయినవి. ప్రతి పీఠమువారు ఇదే మా పాఠమని, ఇదే మా నామమని భగవద్గీతకు వ్యతిరేకమైన ఎన్నియో అజ్ఞాన గుర్తులను మన మధ్యన ప్రవేశపెట్టినారు.
ఇన్ని జ్ఞానాజ్ఞాన నామాల మధ్య "ఏ నామము కానిదియే! శ్రీ గురు నామము".
ప్రతి మనిషికి ఒక చిరునామ ఉండనే ఉంది. కానీ, తన శారీరక చిరునామాయే సరిగా తెలియని జీవునికి, తన ఆధ్యాత్మిక చిరునామా ఏ మాత్రమూ తెలియదు అనియే చెప్పాలి. తన చిరునామాయే తనకు తెలియనప్పుడు, ఇక తన పెరునామా యైన "గురు నామా"ను జీవుడు తెలియుట దుర్లభమే కదా!
నేటి త్రైతశకమున, ఆ ఆనంద గురుకృపతో, శిష్య నేత్రములు చేసుకున్న అదృష్టముతో "దేవుని చిహ్న"మను ఆత్మనామా ను, "దేవుని ముద్ర"యను పరమాత్మనామా ను బాహ్యముగా దర్శించగలిగాము. అయితే, వాటి రెంటినీ లోదృష్టిలో సమన్వయపరచి, వాటిలో దాగిన సంచలాత్మకమైన జ్ఞానమును జ్ఞాననేత్రములతో దర్శించిన అభౌతికమైన "గురు (ముద్ర) చిహ్నము" గురునామమై ప్రకాశించగలదు.
ఎవరైతే అన్యచింతనలేని, ఆత్మచింతనతో తన చిరునామాను చేరి, ఏ చింతాలేని తన పెరునామా యైన ఆ పరమాత్మచింతనలో నిలిచిపోతారో, అట్టివారు తప్పక "గురునామమును" ధరించగలరు. ఏ నామమును ధరిస్తే ఇక ధరించవలసినది ఏమి లేదో! అదే "నా గురు నామము".
సర్వం శ్రీ గురు చరణార్పితం !!!
గమనిక: ఈ గీతములో పొందుపరచిన ౩౬ వేమన పద్యములు గురుశక్తి సంధాయకములు.
విశేషం: గురుపౌర్ణమి, ఆదివారం, సూర్యోదయం! - త్రైతారాధన:
TEAM:
Lyricist - Siva Krishna Kogili
Singer - Dhanunjay
Music - Nagesh
Video Composition - Subbu
Production & Presented By - Gnanavaahini Channel
సాకీ:
నాదు మనసుమారి మేళవించగ భక్తి నాదు బుద్ధి బొందె తత్త్వయుక్తి
నాదు చిత్తమందు రసియించగా రక్తి నాదు అహముకందె ఆత్మశక్తి
నాదు భగమునందు జీవమొందగా ఓ వ్యక్తి అది గురు నామమై నాకు అందె ముక్తి అందెనులే నాకు ఆ ముక్తి
కో:
గురునామమె త్రైతాత్మల చరితం
గురునామమె జ్ఞానామృత భరితం
ప:
గురు నామమే నా చెంతనుంటే అన్యచింతన చేరునా
గురు నామమే నా చింతయైతే ధన్యవంతుడనేనురా //2
నా మదిన జ్ఞానము గురు నామమే నా హృదిన ధ్యానము గురు నామమే
నా కర్మ పానము గురు నామమే నా ధర్మ ప్రాణము గురు నామమే
గురు నామమే//
కో:
గురునామమె ప్రణవానికి నాదం
గురునామమె పంచామృత వేదం
చ:
గురు అను పదము అపారం అది అనంత శక్తికి ద్వారం
గురువును గను ఆస్కారం అది పరమాత్ముని సాకారం
గురు జ్ఞానమరయుట బ్రహ్మైక వేద్యం గురు గూర్చి తెలుపుట యదియే అసాధ్యం
అది సోహమందున ధ్వనియించు వాద్యం ఇది ఊహకందని అత్యంత చోద్యం
గురుపదము ఎవరిని వరియించునో అతనవును అవనికి సాకారము
గురుమహిమ ఎవనిని స్పృశియించునో ఆ తనువు పొందు నిరాకారము
సాకార బోధగ గురు నామమే హృదయాన చేరెను గురు నామమే
నిరాకార శక్తిగ గురు నామమే పరధామమిచ్చెను గురు నామమే
గురు నామమే సాకారమైతే అహంకారము చేరునా
గురు నామమే ఓంకారమైతే గుణవికారము గూడునా
కో:
గురునామమె ఏకాంత నివాసం
గురునామమె పూర్ణామృత వాసం
చ:
నశియించగ నా పాపం గురుధ్యానమెగా నా దీపం
వశియించగ నా జీవం గురుధామమెగా నా స్థానం
భవసాగరమ్మున మునిగేటి కాలం భగవానుగా చేయందించు మూలం
దరి మూసివేయగ తిమిరాంధకారం గురుజ్ఞానమై వినిపించేటి సారం
గురుశ్రద్ధ ఎవనిలో జనియించునో అతనిలో ధ్వనియించు ప్రబోధము
గురుబుద్ధి ఎవనిలో ఉదయించునో అతనిలో హృదయించు ఆనందము
నా తృప్తి తీర్చగ గురునామమే తన జ్ఞప్తినిచ్చెను గురునామమే
నా జన్మ మార్చగ గురునామమే తను జన్మ దాల్చెను గురునామమే
గురు నామమే నా ధ్యాసయైతే మనోధ్యాసలు చేరునా
గురు నామమే నా శ్వాసయైతే బుద్ధినాశలు గూడునా
కో:
గురునామమె గుణరహిత సుదీపం
గురునామమె గుహ్యామృత రూపం
చ:
గుణములులేని గుకారం గురుతించగ జ్ఞానపు సారం
రూపములేని రుకారం దరిశించగ అది ఓంకారం
గుణమాయనణచగ సగుణోపవాసం గురుమాయయమరగ గుణరహిత యోగం
అది రూపుదాల్చిన ఓ విశ్వరూపం హృది చూపునొందగ నా స్వస్వరూపం
గురు కరము ఎవనిని దీవించునో అతనెపుడు చేయును గురు కార్యము
గురుభావమే మది భావించునో ఆ శిరము కందును గురు వీర్యము
గురుపుత్రుడై తల ప్రభవించగా తన వీర్యమిచ్చెను గురునామమే
గురుత్రైతమే ఇల ప్రకటించగా తను కార్యమాయెను గురునామమే
గురు నామమే నా స్వంతమైతే అన్యచింతన చేరునా
గురు నామమే నా అంతమైతే ధన్యవంతుడనేనురా
నాకున్న ధైర్యము గురు నామమే నాదైన స్థైర్యము గురు నామమే
నా జన్మ సూత్రము గురు నామమే నా ధర్మ క్షేత్రము గురు నామమే
గురు నామమే నా చెంతనుంటే అన్యచింతన చేరునా
గురు నామమే నా చింతయైతే ధన్యవంతుడనేనురా
గురు నామమే నా స్వంతమైతే అన్యచింతన చేరునా
గురు నామమే నా అంతమైతే ధన్యవంతుడనేనురా!

Пікірлер
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 79 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
20230813 కర్మ యోగము  42వ శ్లోకము
38:40
దైవ జ్ఞానము
Рет қаралды 495
గురు పూర్ణిమ కృష్ణ మందిరం
2:09
Gurupaduka Stotram
7:17
Seven - Topic
Рет қаралды 852 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 25 МЛН