Рет қаралды 76,481
హనుమా నినొక్కసారి చూడాలయా
శివరంజని రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప
పల్లవి
హనుమా నినొక్కసారి చూడాలయ్యా
నా గుండెచాటు బాధనీకు చెప్పాలయ్యా
"అమ్మా నాన్న అన్నీ నీవే నయ్యా"2" హనుమయ్యా నినొక్క సారి చూడలయ్యా
"హనుమా నినొక్క"
చరణం 1
నిన్ను చూపి మాఅమ్మ భజన చేయమంటోంది
నీసేనకు మాఅమ్మ నాకు జన్మ నిచ్చింది
కష్టాలను తీర్చుతానని కథలెన్నో చెప్పింది
కన్నీలను తుడుస్తవని కంటిచూపు నిచ్చింది
మమ్ము విడిచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా
మమ్ము మరచి ఈ గండిలో శిలవైతే తప్పయా
"హనుమా నినొక్క"
చరణం 2
దీనులంత నీకోసం ధ్యానిస్తూ ఉన్నారూ
జగమంతా నీకోసం జపియిస్తూ ఉన్నారు
బాధలను తీర్చేటి బంధువు నీవన్నారు.
భక్తులను బ్రోచేటి దైవం నీవన్నారు
మమ్ము విడిచి నీవిక్కడ మరుగైతే ఎట్లయా
మమ్ము మరచి ఈ గండిలో శిలవైతే తప్పయా
"హనుమా నినొక్క"