Рет қаралды 105
అమరావతి\పల్నాడు: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 26వ తేదీ జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. మహా శివరాత్రి ఏర్పాట్లతో పాటు త్రికోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్శనం క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కొండ పైకి వెళ్లే మార్గంలో ఉన్న పిల్లల పార్క్, జంతు ప్రదర్శనశాల, బోటింగ్ పాయింట్లనూ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పరిశీలించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కోటప్పకొండ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యిందని... గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాద్ రావు కోటప్పకొండను అభివృద్ధి చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గుర్తుచేశారు. మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోటప్పకొండకు పూర్వ వైభవాన్ని తెస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబులతో పాటు స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
#AsianetNewsTelugu #MahaShivaratri #Kotappakonda #GottipatiRaviKumar #TDP #AndhraPradesh
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️