Рет қаралды 85,345
పల్లవి: కదల నివ్వను చూడరా | రాఘవ నిన్ను !
కదల నివ్వను చూడరా
కదల నివ్వను యెంత ఘనము జెప్పిన గాని మదిలోన నీ వెంతో-మరుగు బెట్టిన గాని ॥
1. కోపము రానివ్వకు । నీలో ధర్మ- గుణమెందు బోనివ్వకు పాపిష్ఠి నరుడను-వోపలేను సుమ్మి నీ పాదములు సాక్షి-చేపట్టకను నిన్ను
2.మంది జెప్పిన వినను | నాలోనైన | మర్యాదయిక బూనను
నింద నొందితి మరి సందేహ మిక యేమి కందర్ప జనక ని-న్నెందైన నరికట్టి -
3 సీత జెప్పిన వినను I నాలోవొక్క , నీతి లేశము బూనను రాతిరి పగలొక్క-రీతిగ జరిగితే
కౌతుక మాయె రా-కమచెర్ల సంచార