Рет қаралды 509
శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సీతారామాపురం మండలంలోని బెడుసుపల్లిలో జన్మించారు. కాశమ్మ, సుబ్బారెడ్డి ఇతని తల్లిదండ్రులు. ఈ దంపతులకు రెండవ సంతానం ఈయన. ఈయన పూర్వ నామం మున్నల్లి కాశిరెడ్డి. బాల్యంలో ఇతను గురు అతిరాచ గురువయ్య స్వామిచే ప్రభావితుడయ్యాడు. అనేక తీర్థయాత్రలు చేశాడు. కాశీ నుండి కన్యాకుమరి వరకు అనేక క్షేత్రాలను దర్శించాడు. ఆయన డిసెంబరు 6, 1995 లో మరణించాడు