పల్లవి ॥ లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి వొయినాల గుమ్మడి లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి చరణం 01॥ పుట్టలో పుట్టిన పుత్తడి బొమ్మ బాయిలో వెలసిన బంగరు బొమ్మ బళ్ళాలు కత్తులిడిసి పెట్టిందమ్మ బాసింగం కట్టుకోని మెరిసిందమ్మ ఢిల్లెం పల్లెం డోలే కొడుతూ దరువేసే ఒగ్గు రాజు ముద్దులొలికే ముద్దుగుమ్మకు మూడు ముళ్ళేసే మునిరాజు పరమ కళ్యాణి ఆ రేణుకమ్మ పెండ్లి చూసి ప్రకృతమ్మ మురిసిపోయి చిరుజల్లులు కురిపించే చల్ లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి చరణం 02॥ ఒక దిక్కు వేదాలు మంత్రాలు ఇంకో దిక్కు బలమైన దండకాలు అటు చూస్తే ఘనమైన సింహాసనాలు ఇటు చూస్తే మెట్ల మెట్ల మట్టి గద్దెలు ఎన్నో శక్తుల ఎల్లమ్మ తల్లికి ఎంతో వైభవంగా యేటేటా కళ్యాణం జరుగుతుంది మిన్నంటే సంబరంగా కలియుగాన్ని కాపాడే కల్పవల్లి ఎల్లమ్మకు కట్నాల్ సదివిస్తున్టరు కోట్లాది భక్తులు చల్ లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి చరణం 03॥ పసుపు సల్లుకుంటున్నరు శివసత్తులు పరవసించి ఆడుతుండ్రు జోగినమ్మలు గజ్జ కట్టి దుంకుతుండ్రు పోతరాజులు గాయి గాయి చేస్తున్నరు పోరగాన్లు జాతరలో మారుమోగుతున్నయ్ ఎస్.వీ.సీ. వారి పాటలు గల్లీ గల్లిలో దుమ్ములేపుతున్నయ్ డీజేల మోతలు జాతరంటే జాతర రేణుకమ్మ జాతర సూడనింకి వెయ్యి కన్నులైన చాలవంటరా చల్ లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి చరణం 04॥ నగరం కాదు రాష్టృం కాదు యావత్ దేశమంత ఎల్లమ్మకు భక్తులున్నరు కోట్లకు పడగెత్తిన కుబేరులు సైతం ఎల్లమ్మను నమ్ముకోని కొలుస్తున్నరు కొలిచినోళ్ళ కొంగు బంగారం చేస్తుంది రేణుకమ్మ తలచినోళ్ళ తల మీద గొడుగై కాపాడుతున్నదమ్మ యేట ఆషాఢంలో బాయి నుండి బైటికెల్లి మునిరాజు మనువాడి మురిసిపోతున్నదమ్మ చల్ లగ్గమాయే లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయే ఓ లచ్చ గుమ్మడి
@bittlashivadatta972015 күн бұрын
Occasion tho sambandham lekunda prathi pooja lo prathi festival lo Ee song maarumoguthundi But credit motham singer ke osthundi Please upload a new thumbnail with writers photo Don’t try to assassinate the writer
@ArvindYadav-x8n4s15 күн бұрын
Yes!!! Gokul Anna ni thokkesdam ani chusthunnaru, kani adhi kani pani 🔥 Team KGF 😎
@GaneshMangilipally15 күн бұрын
Yes I do agree. These people are trying to assassinate Gokul Anna but that isn’t possible. Gokul Anna photo petti thumbnail change cheyyaka pothe channel report kodudam report kottipisdam Andari thoni 😡 Team KGF 💪😎
@Chandu-bx3rs14 күн бұрын
100% We support Gokul Anna ❤️ Team KGF 😎
@svcrecordingcompany23914 күн бұрын
Video lo and description lo writers names tappakunda untai svc lo...Talent unnodini evaru thokkeyaleru...Ee tune lo gokul ki raayamani cheppindi kooda nene. Video & description lo & audio platforms lo choodandi clear ga telustundi.