Рет қаралды 126,833
ఆనాడు ఓ బామ్మగారి అరుదైన ఆలోచనతో ఆత్రేయపురాన సరవపై ఆవిష్కృతమైన పూతరేకు ఇక్కడి నుండి సాగించిన పయణనా దేశ విదేశాలకు సైతం చేరి ఎందరికో మాధుర్యాన్ని పంచి 300ఏళ్ల మధుర చరిత్రను స్వీయ లిఖితం చేసుకుంది. వందలాది కుటుంబాలకు స్వయం ఉపాధి చూపుతుంది.
తరముల నేపధ్య ఈ మధురం పరి పూర్ణతకు కరములలో నిగూడమై ఉన్న కళాత్మక నేర్పే.. ప్రాధమిక చేర్పు.
ఆ శ్రేష్ఠత శైలి ఆత్రేయపురం వారికీ రమారమి మూడు శతాబ్దాల అనుభవైక వేద్యం.
ఈ నేల పై మాత్రమే పండించే అరుదైన బియ్యాన్ని మిశ్రమంగా మలుచుకుని అందులో చిరు వస్త్రాన్ని ముంచి
కొబ్బరి కారకు మంటతో మసిలే కడవపై పూయంగా పూచే పూత రేకుకు జిహ్వమ్ కోరువిధంగా తత్సంబంధిత పదార్థాలను మిళితం చేసి అందిస్తారు. అంతిమంగా సంపూర్ణత పొందిన ఈ మిఠాయిని అలా నోటికి స్వీకరించగానే ఆస్వాధనాపూరిత సారాంశం. మధుర తన్మయత్వమే.
ప్రసిద్ధి చెందిన పూత రేకు గూర్చి కార్యాక్రమాన్ని ఆత్రేయపురం లోని సత్యవతి గారి ఇంటి వద్ద చిత్రీకరణ చేసాము. ఆ సందర్భంనా తాము తయారు చేసిన పూత రేకుకు కమ్మటి నేతిని,పిస్తా,బాదం, జీడిపప్పులను మరియు బెల్లం పొడి జోడించి నాకు అందించిన పూత రేకును ఆస్వాదించిన క్షణం ఎప్పటికీ, ఎప్పటికీ మరుపురాని మధుర జ్ఞాపకం.
కనుకనే చెబుతున్నాను .నా ఆహార విహారంలో నేను మెచ్చిన తినుబండారాలలో ఆత్రేయపురం పూతరేకులది ప్రధమ స్థానం. అలానే శ్రీకాళహస్తి పాలకోవా కూడాను.
తయారీ సమయంలో వెలువడే పొగతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారు అనేకమంది. తీరనిలోటుతో విషాదం నింపుకున్న కుటుంబాలు ఎన్నో.
మధుర రుచి వెనుక మీకు తెలియని చేదు నిజం ఇదే.
పూతరేకులకై సంప్రదించగలరు
ఆత్రేయపురం సత్యవతి గారు :-9392656859
దయచేసి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టవద్దు ..ధన్యవాదాలు
Music Credit :-
Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/