MADDIMADUGU HANUMAN MALA DHARANA 2024 SRI JAYARAM GURUSWAMY UMAMAHESHWARAM

  Рет қаралды 13,056

HANUMAN SHAKTHI

HANUMAN SHAKTHI

Күн бұрын

🚩శ్రీ మద్దిమడుగు ఆంజనేయ స్వామి హనుమాన్ దీక్షా🚩
💐ప్రారంభం💐/
తేది:-02/11/2024 శనివారం
ఉమామహేశ్వరస్వామి క్షేత్రం నందు
శ్రీశ్రీ కేతావత్ జయరాం గురుస్వామి గారి కరకమలములచే
హనుమాన్ దీక్ష నియమాలు_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఆంజనేయ స్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం , మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాలధారణకు తల్లిదండ్రులు , భార్య అనుమతి ఉండాలి. తల వెంట్రుకలు , గోళ్లు , ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి కాషాయం లుంగీ , కండువా , చొక్కా , తులసిమాల తీసుకొని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాలి.
దీక్షా సమయంలో హనుమాన్ స్వాములు పాటించవలసిన నిత్యనియమావళి
1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని , చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి , స్వామికి దీపారాధన గావించి , స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి , స్వామికి దేవతార్చన జరిపి , రాత్రిపూట భిక్ష (అల్పాహారం) చేయాలి.
2. రోజూ ఉదయం , సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.
3. కాషాయం దుస్తులు మాత్రమే ధరించాలి.
4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.
5. మెడలో ధరించిన తులసి మాల ను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. హనుమాన్ సన్నిదానం చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.
6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.
7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట హనుమాన్ స్వాములకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్య జీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.
8. మెత్తటి పరుపులు , దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.
9. స్వాములు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి , పంచగవ్య శిరస్నానమాచరించి , స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.
10. దీక్షలో 'స్వామియే శరణం ఆంజనేయ ' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను.
11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.
12. తమ పేరు చివర 'హనుమా' అని పదము చేర్చాలి. ఇతరులను 'హనుమా' అని పిలవాలి. స్త్రీ లను '' 'మాతా' అని పిలవాలి.
13. ఆంజనేయ స్వాములు ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.
14. హనుమాన్ స్వాములు నుదుట ఎప్పుడు సింధూరం బొట్టు ఉండాలి.
15. మద్యము సేవించుటగాని , పొగాకు పీల్చుట , తాంబూలం వంటి దురలవాటును మానుకొనవలెను.
16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను.
17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము.రోజు ఉదయం సాయకాల పూజలలో బజన చేయాలి. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.
18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట , దుర్భాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి.
19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి , తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.
20. అష్టరాగములు , పంచేంద్రియములు , త్రిగుణములు , విద్య , అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే హనుమాన్ దీక్షా నియమం
21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు స్వాములకు భిక్ష పెట్టుట మంచిది.
22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం , సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.
23. దీక్షా సమయంలో వయస్సు , హోదా , అంతస్తు సర్వము మరచి సాటి హనుమాన్ స్వాములకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. *కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.*🙏🏻🙏🏻🙏🏻

Пікірлер
మన ధర్మం హిందూ ధర్మం
12:11
Muralikrishna Rayaprolu
Рет қаралды 807
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 24 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,1 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 11 МЛН
హనుమాన్ శక్తి జాగరణ సమితి
6:32
Muralikrishna Rayaprolu
Рет қаралды 1,3 М.
Devi Aparadha Kshama Stotram | Part #7 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020
18:47
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 7 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 24 МЛН