Mangalam (మంగళం ఆచార్య దేవా !)- Lyrical Song 92 | Mukkoti Ekadasi | Uttarayanam | Sankranti Spl Song

  Рет қаралды 198,362

Gnanavaahini channel

Gnanavaahini channel

2 жыл бұрын

ఈ సృష్టి యావత్తు ఆ దేవదేవుని ఏ విధముగా భజిస్తున్నదో, ఆ రాజాధిరాజును ఏ విధముగా కీర్తిస్తున్నదో .. ప్రథమ, మధ్యమ, అంతిమ గ్రంథములు (గీత, బైబిల్, ఖురాన్) మూడింటిలోనూ స్పష్టముగా తెలియబడినది. అఖండమైన ఆయనను, ఈ సృష్టిలోని ప్రతి ఖండము ఎట్లు ఘనపరుస్తున్నదో, అట్లే జీవాత్మలైన మనము కూడా ఘనపరచవలెను. అదే నిజమైన శోభనమునకు, శుభకరమైన మోక్షమునకు నాంది.
ఈ ముక్కోటి ఏకాదశి రోజున, ఉత్తరాయణ జ్ఞాన కాలము ప్రవేశమయిన శుభ సమయమున, సాక్షాత్ పరమాత్మ స్వరూపులైన, ఈ సృష్టికే ఏకైక గురుదేవులైన, శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి "మంగళము" పాడుకొను అద్భుత అవకాశమును ప్రసాదించిన "మధ్యాత్మకు" నా హృదయపూర్వక నమస్కారములు.
ఒకటవ ఆత్మనయిన జీవాత్మను నేను, లెక్కకు మూడవ ఆత్మయిన పరమాత్మను తెలియుటకు, రెండవ "ఆత్మ"ను ఆధారము చేసికొనక తప్పదు. అట్టి ఆత్మలింగనికి చెప్పు విషయము ఏమనగా! "నీవు నీ హృదయములో జ్ఞాన ప్రకాశమును కల్గిన చంద్రునివై అన్ని విషయములను నీవే చెప్పి నాచేత వ్రాయించి, నాయందు గురువుగయుండి జీవుడైన నన్ను శిష్యునిగ జేసుకొనిన "నా గురువును" నేను శుభకరమైన ఆఖరు స్థితిని, మంగళకరమైన మోక్షమును కోరుచున్నాను. కర్పూర హారతిని మంగళ హారతి అనుచున్నారు. కర్పూరము అగ్నికి కరిగిపోయినట్లు నా కర్మ జ్ఞానాగ్నికి కరిగిపోయి నేను శూన్యమై పోవునట్లు దీవించమని 'మంగళము మద్గురు చంద్రమా!' అంటున్నాను. శుభకరము, మంగళకరము, శ్రీయుతము అని పోల్చబడు పరమాత్మా! నన్ను నీయందు చేర్చుకొనుటకు ఈ వ్రాతలు ఉపయోగపడాలని చివరిగ "మంగళము" చెప్పి మరి మరి మ్రొక్కుచున్నాను."
TEAM:
----------
Lyricist - Siva Krishna Kogili
Singer - Praveen Kumar Koppolu
Music - N Nagesh
Editing - Subbu
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
www.thraithashakam.org/
సాకీ :
-------
మంగళంబు మీకు మద్గురు చంద్రమా
మంగళంబు మీకు మహి ప్రకాశ
మంగళంబు జేసి మరి మరి మ్రొక్కెద
అఖిల జీవసంగ ఆత్మలింగ
పల్లవి:
----------
మంగళం ఆచార్య దేవా మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం
మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ జ్ఞానకీర్తి మంగళం అసలైన శక్తి మంగళం
నింగిన మెదిలే ఆ మేఘాలు ఇచ్చేను హారతులు
నీటిన మెరిసే శశి కిరణాలు చూపే నీ సంగతులు
వీచే గాలులు రేగే జ్వాలలు నీ ఉనికిని చాటేందుకె గురుతులు
మంగళం ఆచార్య దేవా మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం
మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ జ్ఞానకీర్తి మంగళం అసలైన శక్తి మంగళం
చరణం 1:
---------------
సప్తాకాశాలు నీ కీర్తన చేసే రుతుపవనాలు
గుప్తాదేశాలు నీ వార్తకు వాహికలు
ధాత్రీజనితాలు నీ స్తోత్రము చేసే ప్రతిభాగాలు
ధారాజనకాలు నీ పాత్రకు పోషకులు
ఆకాశములో దాగిన ఆదిత్యుని ఓంకారాలు
ఆద్యంతములై మారిన ఆదికి మంత్రాలు
ఈనాసికలో చేరిన ఆమారుత ఘీంకారాలు
ఈశాపరమేశా అని చేసెను స్తోత్రాలు
ధాతుకణమందు ప్రతియొక వెలుతురు జ్యోతి నీదంటు మిళమిళలు
దూతలైయున్న ప్రతితను భాగము ఖ్యాతి నీకంటు కళకళలు
ఆత్మే అలుపేలేక పలికెను నీకై వచనములు
మంగళం ఆచార్య దేవా మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం
మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ విశ్వకీర్తి మంగళం పరమాత్మ శక్తి మంగళం
చరణం 2:
---------------
క్షితిలో భూతాలు నీ కీర్తిని చాటే సంకేతాలు
మతిలో భావాలూ నీ సూక్ష్మపు చేవ్రాలు
రోదసిలో గ్రహణాలు నీ కక్షను దాటక నిరీక్షణాలు --
దశలో చరణాలు నీ దక్షతకై చాలు
వేదాంతులు సిద్ధాంతులు నీ కోసం శ్రద్ధా బుద్దుల
తో సాధన సిద్ధించెడి గద్దెకు బానిసలు
రాజర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు తీరెను బారులు
నీ హర్షను చేరేందుకు చేసెను యోగాలు
విశ్వరూపాన విరివిగ వెలసిన వేదమంత్రాల గుణవరులు
అశ్వతేజాన పరుగున పలికెడి ధర్మశాస్త్రాల గురువరులు
సర్వం సకలం నీవేనన్నవిలే మంజీరాలు
మంగళం ఆచార్య దేవా మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం
మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ యోగకీర్తి మంగళం మధ్యాత్మ శక్తి మంగళం
చరణం 3:
---------------
సాంఖ్యా యోగాలు దేహాంఖము దాటని ప్రతి భాగాలు
శంఖారావాలు పూరించెడి మార్గాలు
స్మృతిలో శ్రవణాలు పతివైపుకు మరలే మతిపవనాలు --
హృదిలో పూర్ణాలు గావించెడి గమ్యాలు
నగరాలను దాటాలని గురుజ్ఞానపు సందేశాలు
నరనాడులు ఎగబ్రాకిన శ్వాసకు శస్త్రాలు
గ్రామాలకు ప్రాణాలను బలిచేసిన సంకేతాలు
గురుగ్రంథికి సంధించిన గ్రంథుల అస్త్రాలు
భ్రూమధ్యాన భూమిక తునకలు భూసమాధికై సాధికలు --
జీవగర్భమే భగమై గురుభాగం దర్శించు వేదికలు
తనలో నిన్నే చూసి చేసెనులే సాష్టాంగాలు
మంగళం ఆచార్య దేవా మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం
మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ త్రైతకీర్తి మంగళం గురుతైన శక్తి మంగళం
గిరులు ఝరులు ఆ సుమవరులు ఇచ్చేను హారతులు
తరులు మరులు లోచనవరులు చూపే నీ సంగతులు --
రేచక పూరక కుంభక సూచక యోగీశ్వరునికి నీరాజనాలు
మంగళం ఆచార్య దేవా మంగళం ఆనంతవాస మంగళం అద్వైత రూప మంగళం
మంగళం ఓ చక్రవర్తి మంగళం నీ త్రైతకీర్తి మంగళం గురుతైన శక్తి మంగళం
ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే
సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం !!
---------------XXXXX-------------------
జ్ఞానమును సముపార్జించిన పిదప భక్తుడు భగవంతుని భజించవలెను, క్రీస్తుని కీర్తించవలెను. భగవంతుని భజించుటయే నిజమైన భజన, క్రీస్తుని కీర్తించుటయే నిజమైన కీర్తన.
అసంతృప్తితో అర్థించునది ఆర్తన కాగా, సంతృప్తిగా ప్రార్థించునది కీర్తన.
మాయా జ్ఞానము పూర్తి కాక మునుపు వరకు ఆర్తితో అర్థించు జీవుడు, మాయ జ్ఞానము పూర్తి చేసుకుని గురువుని తెలుసుకున్న పిదప కీర్తనతో ఆయనను కీర్తించవలెను.
భజన అనునది యోగసంబంధమైనది కాగా, విభజన అనునది మాయకు సంబంధించినది. మాయను తెలుసుకొనుటకు జ్ఞానమును విభజన చేసి చూడవలెను, భగవంతుని తెలుసుకొనుటకు జ్ఞానముతో భజన చేసి తెలియవలెను. "మాయను" తెలిసిన పిదపే "భగవంతుడు" తెలియబడును కావున మొదట విభజన చేసి ఆధ్యాత్మికమును తెలుసుకొని, తరువాత భజన చేసి నిజమైన ఆత్మను గుర్తించవలెను.
శరీరాంతర్గతములో ఉండి జ్ఞానము చేత పొగడబడునది "ఆత్మ" !!!
----- శ్రీ శ్రీ శ్రీ "ఆత్మ ప్రబోధాయ" మంగళం -----

Пікірлер
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 60 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 39 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,7 МЛН
Sanchita Karma | Dt : 23-06-2013 | Thraithasiddantham
59:13
Thraitha Siddantham
Рет қаралды 52 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 241 М.
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 108 М.
JAMAL & GANJA, ИРИНА КАЙРАТОВНА & КАЙРАТ НУРТАС - TUN (LYRIC VIDEO)
3:41
ИРИНА КАЙРАТОВНА
Рет қаралды 1,3 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 1,5 МЛН
Sevinch Ismoilova - Ustozlar qo'shiqlaridan popuri (Xorazmcha)
6:15
Sevinch Ismoilova
Рет қаралды 1,3 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 13 МЛН
Dj Jack SpaRRow - Akbar Ghalta Bahiati ( Slap Remix Arabic ) #TIKTOK
2:21
Dj Jack SpaRRow
Рет қаралды 2,7 МЛН