సంక్రాంతి శోభ.! తొలి పండుగ పిలుపులతో ... పులకించేను పల్లెలిలా.! తొలివేకువ వెలుగులతో... వికసించేను హృదయాలే.! సంక్రాంతి సందడితో..ఆటపాటలతో చేద్దాము.... వేడుకలే.! మన సంస్కృతి నే ఊపిరి చేసి ... సంక్రాంతి పండుగ చేద్దాం.! మమతలనే ముగ్గులు వేసి ... మనసులనే పూలుగా పెడదాం.! పశువులనే ప్రేమగ చూసి ... ప్రకృతినే పరిరక్షిద్దాం.! ఈ ప్రకృతే మన జీవ నాడిగా... రైతన్నే మనకన్న దాతగా... గుర్తుంచు కుందాము కలకాలం.! పెద్ద పండుగ పిలుపులతో .. పులకించేను పల్లెలిలా.! తొలివేకువ వెలుగులతో... వికసించేను హృదయాలే.! సంక్రాంతి సందడితో..ఆటపాటలతో చేద్దాము. వేడుకలే.!