Рет қаралды 995,807
నాన్ వోవెన్ క్యారీ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్న నిర్వాహకుల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న ఉయ్యాలవాడ గ్రామంలో ఈ యూనిట్ నడుపుతున్న నిర్వాహకులలో ఒకరైన పరేష్ గారు ఈ వీడియోలో పలు వివరాలు తెలిపారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : Non Woven క్యారీ బ్యాగ్స్ తయారు చేసి అమ్ముతున్నం | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #carrybagsbusiness