What a blessed soul! She must have done a lot of good deeds in her previous birth!
@JaiSriRam-t7s Жыл бұрын
Telugu beautiful songs....
@svkrishna4976 Жыл бұрын
ఓ రామ నీనామ శ్రీరామ నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 1: కరిరాజ ప్రహ్లాద ధరణిజా విభీషణులు గాచిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 2: కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ కమ్మనీ నీనామ మేమి రుచిరా || ఓ రామ || చ 3: నవరసములకన్న నవనీతములకంటె అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 4: పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె అధికమౌ నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 5: అంజనతనయు హృత్కమలంబునందు రంజిల్లు నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 6: శ్రీ సదశివుడు తా నేవేళ భజియించు శుభరూప నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 7: సారములేని సంసార తరుణమునకు తారకము నీ నామ మేమి రుచిరా || ఓ రామ || చ 8: శరణన్న జనులను సరగున రక్షించు బిరుదుగల్గిన నామ మేమి రుచిరా || ఓ రామ || చ 9: తంబురనారదుల్ డంబమీరగ గా నంబు చేసెడి నామ మేమి రుచిరా || ఓ రామ ||అఘ చ 10: అరయ భద్రాచల శ్రీ రామదాసుని ఏలిన నీ నామ మేమి రుచిరా || ఓ రామ ||