Рет қаралды 31,945
సంకీర్తన :ఒక్కడే అంతర్యామి
రాగం : రేవతి
స్వరపరచిన వారు : శ్రీ సాలూరి వాసురావు గారు
ప|| ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు | తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||
చ|| యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు | గుఱియై మాయలలోన గూడించే వింతె |
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు | తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||
చ|| సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు | బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె |
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత | నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||