Рет қаралды 157
పాట తో పాటు క్రింద ఇవ్వబడిన లిరిక్స్ చూడండీ. మీకు పాట అర్ధం అవుతుంది. 😍 don't worry be happy 😍
#gamechanger #pushpa2 #sankranthikivasthunnam #lifestyle #lovesongs
LYRICS::
లైఫ్ అంటె ఆటరా... హద్దులేని వేటరా
బ్రదరూ నీ చేతితోనే ..నువు రాసుకున్న ఫేటు రా
ఇచ్చాడొక చిన్న జీవితం
కాలానికి అది ఓ క్షణం
సౌఖ్యాల పరుగుల్లోనే..
ఐపోతదిరా అంకితం
లైఫ్ అంటె ఆటరా... హద్ధులేని వేటరా
బ్రదరూ నీ చేతితోనే ..నువు రాసుకున్న ఫేటు రా
సుఖాలలో శుకమై ఉంటే
పరుగాపక పరిగెడుతుంటే
ఆనందం అర్థం మార్చి...
ఆశలతో జీవిస్తుంటే
నిజమన్నది ప్రక్కకు తొసి నీకు నీవే భరువవుతుంటే
చెప్పాలని ఉందిరా నేస్తం, నీకే ఒక జీవిత సత్యం
ఏ ఆశ లేనిది బాల్యం పొందేటి ఆ ఆనందం
వస్తుందా ఓ మైడియరూ కొండంత నీ కోరికలో
దక్కిందా చాక్లెట్లు అడగదు రా బిస్కెట్టు
వచ్చిందే చాలంట... సంతోషం మనసంతా
రూపాయికి వచ్చేదే పాపయి సరిపెడుతుంది
వందైనా ఎంతైనా నాకెందుకు పొమ్మంటుంది.
ఆ కళ్ళను చూశావంటే నువ్వు మురిసిపోతావోయ్
లైఫ్ అంటె ఆటరా... హద్దులేని వేటరా
బ్రదరూ నీ చేతితోనే ..నువు రాసుకున్న ఫేటు రా
ఇచ్చాడొక చిన్న జీవితం
కాలానికి అది ఓ క్షణం
సౌఖ్యాల పరుగుల్లోన..
ఐపోతదిరా అంకితం
లైఫ్ అంటె ఆటరా... హాద్ధులేని వేటరా
బ్రదరూ నీ చేతితోనే ..నువు రాసుకున్న ఫేటు రా
నీ చేతిలో రూపాయుంటే నీ ఆశలు లక్షల్లో
చల్లనైన గాలొస్తుంటే నీ ఊహలు ఏ సీ లో
సంపాదన సైకిల్ స్థాయి అప్పుల్లో బైకుందోయి
ఉండొచ్చు రేకుల ఇంట్లో ఉన్నావోయ్ అంతస్తుల్లో
సౌఖ్యం కదా నిన్నెక్కింది పరువే కదా నువ్ మోసేది
పరుగులు నీ నిర్ణయానివి. ఫలితమెట్ల దేవుడికిస్తావ్
లైఫ్ అంటె ఆటరా... హద్దులేని వేటరా
బ్రదరూ నీ చేతితోనే ..నువు రాసుకున్న ఫేటు రా
ఇచ్చాడొక చిన్న జీవితం
కాలానికి అది ఓ క్షణం
సౌఖ్యాల పరుగుల్లోనే..
ఐపోతదిరా అంకితం
లైఫ్ అంటె ఆటరా... హద్ధులేని వేటరా
బ్రదరూ నీ చేతితోనే ..నువు రాసుకున్న ఫేటు రా
✍️ కృష్ణ కుమార్ (కిట్టు)