Рет қаралды 2,942
ప్రభువునందు ఆయన వాక్యములో పిల్లలను పెంచండి. డబ్బులను, ఆస్తిని, ఇష్టపడకుండా, వాటిని ఘనపరచకుండా, ప్రేమించకుండా....
జక్కయ్య వలె డబ్బులను ఇతరులకు ఇచ్చి ధర్మకార్యాలు చేసి ప్రభువును ప్రేమించే విధంగా పెంచాలి. ఆత్మీయ రక్షణలో అనుదినము జీవించేలాగా, ఔధార్యము గలవారిగా ప్రభువుకు ఇష్టమైన పిల్లలవలే పెంచుదాము. ఇలాగునా ప్రభువు మిమ్మును దీవించునుగాక.
God bless you children.🙌🙏
పొట్టివాడైన జక్కయ్య - యెరికో పట్టణమందుండెను
ధనమును ఎంతో ప్రేమించెను - ఆస్తిని బాగా కూడబెట్టెను(2)
ప్రజలందరు ద్వేషించుచుండెను - నెమ్మది లేక
బ్రతుకుచుండెను (2)
నెమ్మది లేక బ్రతుకుచుండెను ||పొట్టివాడైన జక్కయ్య ||
1. యేసయ్య గూర్చి అతడు వినెను
యేసుని చూడ గోరెను (2)
వడివడిగా మెడుచెట్టెక్కేను
యేసయ్యను వెదుకుచుండెను (2)
||పొట్టివాడైన జక్కయ్య ||
2. యేసయ్య అతనిని చూచెను
జక్కయ్య త్వరగా దిగమనెను (2)
నేడు నేను నీ యింట నుందును
అని చెప్పి జక్కయ్యతో వెళ్ళెను (2)
||పొట్టివాడైన జక్కయ్య ||
3. సంతోషముతో చేర్చుకొనెను
జక్కయ్య బ్రతుకు మారెను (2)
అన్యాయపు సొమ్మును తిరిగి ఇచ్చెను
అబ్రహాము కుమారునిగా మారెను (2)
పొట్టివాడైన జక్కయ్య - యెరికో పట్టణమందుండెను
యేసుని ఎంతో ప్రేమించెను ప్రభువు కొరకు సాక్షిగా నిలిచెను (2)
ప్రభువు కొరకు సాక్షిగా నిలిచెను (2)
#kidsbiblemeet #kidsbiblelessons #kidsbiblestories #kidsbiblesongs #sundayschool #zacchaeus #telugukidsstories #telugukids #christiansongsforkids