Рет қаралды 4
ప్రజల సమస్యలను జవాబు దారీతనంతో అధికారులు పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు సోమవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి "పి జి ఆర్ ఎస్ మీ కోసం"లో ప్రజల నుంచి 30 అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండల స్థాయి అధికారులు అందరూ ఒకే వేదికపై ప్రజలకి అందుబాటులో ఉండి అర్జీలు పరిష్కారం చెయ్యాల్సి ఉందన్నారు.ప్రజల సమస్యలు మరింత వేగవంతం చేసే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.అర్జీల పరిష్కార ప్రక్రియ పెండింగ్ లేకుండా అధికారులు చూడాలని స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన విధంగా అర్జీదారులు సంతృప్తే ధ్యేయంగా పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలని సూచిం చారు. సమస్యల పరిష్కారం కొరకు క్షేత్ర స్థాయి అధికారులతో నిరంతర సమ న్వయం అవసరమన్నారు. ఆర్జీ అందిన వెంటనే క్షుణంగా పరిశీలించి, సంబంధిత అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొంటూ నాణ్యత తో పరిష్కరించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ ప్రతి ఆర్జీని నిర్దిష్ట గడువు లోగా అర్జీదారులు సం తృప్తి చెందేలా పరిష్కరించాలని తెలిపారు.కొవ్వూరు పట్టణానికి చెందిన కే బి బి ఆర్ ఎస్ ఫణి కుమార్, గామన్ వంతన వద్ద బైపాస్ లో వెళుతున్న ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సులు కొవ్వూరు బస్టాండు కు రావడంలేదని, కొవ్వూరులో ఉన్న ప్రజలందరూ బైపాస్ కి వెళ్లి బస్ ఎక్కవలసి వస్తోందన్నారు. కొవ్వూరు బైపాస్ సెంటర్ వద్ద ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేసి, ఆర్టీసీ సిబ్బందిని నియమించాలని అర్జీ సమర్పించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏ.డి.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, బి. లక్ష్మీనారాయణ కొవ్వూరు ఆర్టీవో, రాణి సుస్మిత, డిఎల్ డివో, స్లీవారెడ్డి, డివిజన్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.