Рет қаралды 45,481
#Raitunestham #Mushroomfarming
పుట్టగొడుగులు.. ఆరోగ్య పరంగా చాలా పోషకాలు కలిగిన ఆహారం. ఆరోగ్య సంరక్షణ, పోషక ఆహారంపై ప్రజల్లో అవగాహన రోజు రోజుకీ పెరుగుతోంది. అధిక పోషకాలు కలిగిన పుట్టగొడుగలు లాంటి ఆహార పదార్థాల వినియోగం ఎక్కువ అవుతోంది. మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో... ఎక్కువ మంది ఉత్పత్తి చేసేందుకు ముందుకు వస్తున్నారు. చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వివిధ రకాల పుట్టుగొడుగులు పెంచి.. మార్కెట్ లోకి పంపిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి రావాలని అనుకునే వారికి .. పుట్టగొడుగల పెంపకంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ లో పుట్టగొడుగుల పెంపకంపై మోడల్ యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఔత్సాహికులు ఫౌండేషన్ ని సందర్శించి.. పుట్టగొడుగుల పెంపకాన్ని పరిశీలించివచ్చు. పెంపకం విధానాలు తెలుసుకోవచ్చు. రైతునేస్తం ఫౌండేషన్ లో గోశాల.. కట్టె గానుగ నూనెల తయారీ యూనిట్... షాయాలు, ద్రావణాలు, మిశ్రమాల తయారీ... సేంద్రియ పంటలను పరిశీలించవచ్చు. వీటితో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లాభసాటి విధానాలపై అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో రైతునేస్తం ఫౌండేషన్ ప్రతి ఆదివారం రైతు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ శిక్షణకు హాజరై.. ఆధునిక విధానాలు, లాభసాటి పద్ధతులు తెలుసుకొని సాగులో లాభాలు పొందవచ్చు.
పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించేందుకు అయ్యే పెట్టుబడి వివరాలు, పెంపకం విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాాచారం కోసం రైతునేస్తం ఫౌండేషన్ ని 94905 59999, 97053 83666,98493 12629 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
--------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------------------