Рет қаралды 407
ఘనంగా జరిగిన శ్రీ సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం".."తాము షిర్డీసాయి అవతారం" అని 1940 అక్టోబర్ 20 వ తేదీ నాడు భగవాన్ శ్రీ సత్యసాయి ప్రకటన పురస్కరించుకుని వేణంపేట-అక్కులపేట శ్రీ సత్యసాయి సేవాసమితి వారు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకూ జంట గ్రామాల్లో పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించామని సమితి కన్వీనర్ చిడిపోతు సూర్యారావు, జిల్లా పదాధికారి ఎం.జనార్దనరావు పేర్కొన్నారు. మహిళలు, బాలవికాస్ విద్యార్థులు కోలాటాలు నడుమ నూతనంగా తయారు చేయించిన పూల పల్లకిలో స్వామి వారిని ఘనంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లామని అన్నారు.. ముందు గా..డాక్టర్ పి.తాతయ్య లు మరియు జోనల్ కన్వీనర్ ఎం.రవీంద్ర బాబులచే కొబ్బరికాయను కొట్టి ప్రారంభించామని వారు తెలిపారు.. కార్యక్రమంలో ఉప్పినివలస,బూర్జ, చిన్న కురుంపేట భజనమండలుల కన్వీనర్లు అల్లాడ సింహాచలం, భోగి రామారావు, వెంకట్రావు లతో పాటు అప్పలనాయుడు మరియు ఈసర్లపేట, సంతకొత్తవలస సాయి భక్తులు తో పాటు వేణంపేట సమితి పదాధికారులు, జోనల్ యూత్ కో-ఆర్డినేటర్ బనిశెట్టి సాయి కృష్ణ, సమితి యూత్ కో-ఆర్డినేటర్లు జి.పవన్, జె.షణ్ముఖరావు,బొబ్బిలి పేట భజన బృందం కన్వీనర్ చింతాడ అప్పారావు , శ్రీదేవి,శ్యామల, అరుణ, హేమలత,శివకుమారి, సరోజిని, ఝూన్సీ, పోలినాయుడు, వెంకట్రావు సాయి మరియు హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
యువజన విభాగం
శ్రీ సత్యసాయి సేవా సమితి
వేణంపేట- అక్కులపేట