శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామీ శరణం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానిగా ప్రపంచానికి సుపరిచితులు అంతేకాదు శ్రీస్వామి వారు మూఢ నమ్మకాలను రూపు మాపడానికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవులంతా ఒక్కటే అని తెలిపిన గొప్ప సమతామూర్తి తాను బోదించినవి ఆచరించి చూపిన మహనీయుడు వీర కాలికాంభ సప్తశతి ద్వారా సమాజములోని అసమానతలు, సమాజములోని కుళ్ళును కడిగిన కవీశ్వరుడు తపోశక్తి ద్వారా ఎన్నో మహిమలు చూపిన యోగిశ్వరులు సజీవ సమాధిలో యోగ నిష్ఠలో ఉండి భక్తుల నీరాజనాలు అందుకొంటున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి వారు.