ఈ చిత్రానికి ఒక బలమైన కథలేకపోవడం, కథలో చెప్పదలుచుకున్న విషయాన్ని సరిగా చెప్పలేకపోయారు అనిపిస్తుంది. కథానాయకునిగా NTR అందంగా కనిపించినా, అతని హీరోయిజం, తెలివితేటలులేని మరియు అమాయకపు హీరో లా కనిపించేలా చేశాయి. కథానాయికగా అంజలి తనపాత్ర మేరకు నటించింది. మిగతా పాత్రలను పోషించిన గుమ్మడి, రేలంగి, నారాయణరావు, CSR, అంజి, నల్ల రామూర్తి తదితరులు పెద్ద నటులు సినిమాకు పేరుకు సరిఅయిన పాత్రలు లేని నటులుగా వున్నారు. సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారు ఈ చిత్రంలో మంచి నేపథ్య సంగీతం మరియు ఒకటి రెండు ఎప్పటికీ మరచిపోలేని పాటలను కూర్చారు. మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రం అనుకున్నంత గొప్పగా ఏమీ లేదు.