వంద పుస్తకాలు చదవడం కన్నా...వంద పుస్తకాలు చదివిన వారితో చర్చలు జరిపితే..సంపూర్ణ విజ్ఞానం దొరుకుతుంది.. tnq..sir..చాలా బాగా..వివరణలు ఇచ్చారు..
@varaprasadvaraprasad92245 жыл бұрын
💐💐💐🙏🙏🙏
@karupentarao62465 жыл бұрын
ఎంతో ఉపయోగకరమైన ఈ విషయాలను మంచి క్వాలిటి కలిగిన కెమెరా, మైకులతో రికార్డింగు చేస్తే బాగుంటుంది. కాబట్టి సురేంద్ర గారు, అలాగే వీడియో upload చేసేవారు ఎవరైతే వారు ఈ విషయాన్ని serious గా తీసుకోండి. దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ సమాజం చాలా జ్ఞానాన్ని కోల్పోయి అడ్డదారులు తొక్కుతోంది. సరియైన దారిలో పెట్టే పని మీరు చేస్తున్నారు. గతంలో కంటే ఈ పని యొక్క అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. కాబట్టి నా సూచనను పరిశీలించి తగు చర్యలు చేపట్టండి. మీకు ధన్యవాదాలు.
@charanraj6665 жыл бұрын
ఇలాంటి సబ్జెక్టు మీద ఇంకే చానళ్లు తెలుగులో లేవు. సిద్ధాంతాన్ని ప్రాథమిక స్థాయి నుంచి సామాన్యుడు అర్థం చేసుకోగల పదాలతో మొదలు పెట్టి వివరించడం అరుదు. సిద్ధాంత బోధన అనగానే తన భాషా కాఠిన్యతయే భాషా సమర్థతను తెలియజేస్తుందని పరిచయం లేని పదాలను వివరణ లేని వాక్యాలను చొప్పిస్తూ ఉంటారు. తత్వశాస్త్ర నేపథ్యం లేనివారికి అదో బ్రహ్మపదార్థంలా మింగుడుపడక వదిలేస్తున్నారు. అన్ని భావజాలాలను పరిశీలించే, పరిశీలించడం నేర్పే మీ మండలి.. ఇంకొంచెం శ్రమ తీసుకోవాలి. ఒక మంచి కెమెరా, మైక్ ఏర్పచుకుని మొత్తం సిద్ధాంతాన్ని భావజాలాన్ని రెండుగా విడకొట్టి పాఠాలుగా మంచి నాణ్యతతో 30-40 నిమిషాలు మించని నిడివితో సులభంగా సుబోధకంగా ఉండే ఓ వీడియో కోర్సు చేసి పడేస్తే.. ఎన్ని ఏళ్లకైనా తెలుగువారికి అది ఉపయోగ పడుతూనే ఉంటుంది. ఈ రకమైన ఆలోచనా పద్ధతులు భావజాలం చూసిన వెంటనే కొట్టిపడేసినా అంగీకరించకపోయినా, తరువాత అనుభవంలోకి వచ్చినప్పుడు క్రమంగా మారుతూ వస్తారు. ఇది నేటి, రేపటి సమాజానికి ఎంతో అవసరం. కోర్సు గా వీడియో సీరీస్ చూసిన తరువాత గ్రూప్ డిస్కర్షన్ చూస్తే ఆసక్తిగా ఉంటుంది.
@bodeddulaobulesu96174 жыл бұрын
Uncle meeru oka sari sp balu garu admit ayyetappudu oka song wrasharu okasari vinandi edi tv9 lo kuda telecast ayindi choodandi
@charanraj6665 жыл бұрын
మంచి కెమెరా, మైకు ఉపయోగించి రికార్డు చేయండి.. కనీసం మైక్ అన్న ఉపయోగించండి.
@ramaiahkumbha55455 жыл бұрын
జ్ఞానం ఏర్పడటమేంటి సర్.. అదేమన్నా వస్తువా..?
@charanraj6665 жыл бұрын
వస్తువు ఎక్కడ ఏర్పడుతాయా? తయారు అవుతాయి కానీ.
@ramaiahkumbha55455 жыл бұрын
@@charanraj666 ఏంటి తేడా..?
@charanraj6665 жыл бұрын
@@ramaiahkumbha5545 తనంతట తానుగా రూపుదిద్దుకొనేవి ఏర్పడటాలు అంటారు. మానవ, దైవ ప్రయత్నం కొంత ఉండవచ్చు ఉండకపోవచ్చు. మానవ, దైవ ప్రయత్నంతో రూపుదాల్చినవి తయారు చేశారు అంటారు.. భూమి ఏర్పడింది. విగ్రహం తయారయ్యింది. నీటి ఆవిరితో మేఘాలు ఏర్పడుతాయి. పడవ చెక్కతో తయారు చేయబడినది. దృవాలలో ఉష్ణోగ్రతలు అతి స్వల్పంగా ఉండటం వల్ల మంచు ఏర్పడింది. ఇండియా టెట్రానిక్ ప్లేట్ ఆసియ ఖండంలోకి చొచ్చుకొని పోవడంవల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. 50 కోట్ల సంవత్సరాల క్రితం కొన్ని జీవులకు చూపు ఏర్పడటం మొదలైనది. ప్రాకృతిక అనిశ్చితి వల్ల మానవుడిలో దైవ భావన ఏర్పడినది. ప్రమాదాల మీద అవగాహన పెరిగే కొద్దీ భయం ఏర్పడుతుంది.. అప్పటి నుంచి అతని మీద అభిమానం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమె మీద మనస్సులో అనుమానం ఏర్పడిపోయింది చాలా రోజులు చదివితే కానీ నాకు విషయం మీద అవగాహన ఏర్పడలేదు. మానవులు సమూహంగా కొంత కాలం జీవిస్తే నూతన సంస్కృతి అన్నది అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఏర్పడటం సహజం. భాష, జ్ఞానాలు కూడా సహజంగానే ఏర్పడుతాయి.. మన ప్రమేయం ఉండొచ్చు కానీ మన నియంత్రణలో అది ఉండదు.
@ramaiahkumbha55455 жыл бұрын
@@charanraj666 నైస్ బ్రదర్ ! కానీ మీరు చెప్పినవాటికి ఆధారం లేదు ! ఎందుకంటే ప్రకృతిలో ఏది దానంతటికి అదే ఏర్పడలేదు ! అలా ఏర్పడితే ఇప్పుడు కూడా ఏర్పడుతూ ఉండాలి ! ఇంతకీ జ్ఞానం ఎలా ఏర్పడిందో కాస్త చెప్పండి ? మీరు చెప్పినదానికి ఆధారం కూడా చూపండి !
@charanraj6665 жыл бұрын
@@ramaiahkumbha5545 నదులు పర్వతాలు సముద్రాలు గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు ఇవన్నీ వాటంతట అవే ఏర్పడ్డాయి..అందువల్ల వీటిని వివరించే విజ్ఞాన శాస్త్ర పుస్తకాలలో ఏర్పడ్డాయని రాస్తారు.. వారుద్దేశ్యం మానవ ప్రయత్నం గాని దైవ ప్రయత్నం గాని లేదని.. మతపుస్తకాలలో దేవుడు (తయారు) చేసాడు అని రాసివుంటుంది. వెలుగు వచ్చు గాక అంటే వచ్చేస్తుంది..భూమి ఉనికిలోకి వచ్చుగాక అంటే వచ్చేస్తుంది.. దీన్నే సృష్టి అన్నారు. జ్ఞానం గురించి ఈ ఛానెల్ లో చాలా వీడియోలు ఉన్నాయి.. బయట జ్ఞాన సిద్ధాంతం మీద చాలా రకాల భవజాలలతో పుస్తకాలు లభిస్తాయి..80% అవి ఒకటే చెబుతాయి. మీరు జ్ఞానం ఎలా ఏర్పడుతుందో ఇక్క వీడియోలలో చూడొచ్చు.. లేదా వీరి బ్లాగు, వివేకపథం యాప్ లో చదవ వచ్చు. ఇది వీరి సొంత సిద్ధాంతం ఏమీ కాదు.. రకరకాల జ్ఞాన సిద్ధాంతాలను అధ్యయనం చేసి దానిలో వీరి భావజాలనికి అనుగుణంగా సేకరించడమో మార్పు చేసుకోవడమో చేసి ఉన్నారు. అయిన ప్రధాన థీరీలోని 90% అంశాలు వీరి థీరీలో భాగమై ఉంటాయి. నేను మార్కిష్టు వారి జ్ఞాన సిద్ధాంతం పుస్తకం చదివాను. తత్వశాస్త్ర పూర్వ పరిచయం లేనివారికి అది సుబోధకం లేదు కాబట్టి పక్కన పడేసాను.. నిజంగా ఓ 10 గంటల వీడియోలు దృశ్య శ్రావణలోని నాణ్యత, పెట్టె సహనాన్ని ఓర్చి చూడగలిగితే, ఆలోచించడం, విశ్లేషించడం, సత్యాన్ని స్వీకరించే పద్ధతుల మీద ఓ అవగాహన రావడం జరుగుతుంది.