Рет қаралды 50,352
Jury A new Green Fodder of Guinea family has introduced in Gannavaram Live Stock Complex of Andhra Pradesh. Jury seeds had brought from Brazil and various tests have been conducted in Gannavaram. Protiens and Yield tests showed that it has rich Proteins and high resistant fodder grass.
పాడి రైతులకి సరికొత్త పశుగ్రాసం జ్యూరీ గడ్డి పరిచయమైంది. గినీ జాతికి చెందిన జ్యూరీ గడ్డి అందుబాటులోకి వచ్చింది. కృష్ణా జిల్లా గన్నవరంలోని లైవ్‌స్టాక్ ఫాం కాంఫ్లెక్సు ప్రాంగణంలో ఈ నూతన గ్రాసం పెంచుతున్నారు.
డా. సీహెచ్ వెంకటశేషయ్య ఆధ్వర్యంలో... గత రెండేళ్లుగా జ్యూరీ గడ్డిపై పరిశీలనలు చేస్తున్నారు. జ్యూరీ గ్రాసంలో పోషకాలు, వెన్నశాతం తదితర అంశాలపై అధ్యయనం చేయగా... మంచి పోషకాలు ఉన్నట్లు గుర్తించారు.
బ్రెజిల్ దేశానికి చెందిన ఈ గ్రాసాన్ని... గన్నవరం ప్రాంగణంలో అభివృద్ధి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విత్తనాలు, పిలకలు ప్రవర్ధనం చేస్తున్నారు. కాబట్టి రైతులకి ఫిబ్రవరి వరకు అందుబాటులోకి రావు. నవంబర్ నుంచి విత్తనాల సేకరణ చేస్తారు కాబట్టి... వచ్చే ఫిబ్రవరి నుంచి లభించే అవకాశం ఉంది. అలాగే ప్రతి జిల్లాలోని ఆయా వ్యవసాయ పరిశోధన కేంద్రాలకి వేరు పిలకలు పంపించి సాగు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి వేరు పిలకలు... ఆయా కేంద్రాల్లో కొన్ని మాసాల్లో లభిస్తాయి.
జ్యూరీ గడ్డి సాగు విధానం ప్రత్యక్షంగా చూడాలంటే... కృష్ణా జిల్లా గన్నవరంలోని లైవ్ స్టాక్ ఫాం కాంప్లెక్సు, ఎన్‌టీఆర్ పశువైద్య కళాశాల ప్రాంగణం సందర్శించవచ్చు.