సాయిని ఆశ్రయించిన వారికి కర్మ తంత్రం బాధించదా? // Sai Gurukulam Episode 1148

  Рет қаралды 5,538

SAI TV Live Telugu

SAI TV Live Telugu

Күн бұрын

Sai Gurukulam Episode 1148 // సాయిని ఆశ్రయించిన వారికి కర్మ తంత్రం బాధించదా?
బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి, దాసుగణు షిరిడీ విడిచి విలీపార్లే చేరి కాకాసాహెబు దీక్షితు ఇంటిలో బసచేసెను. ఆ మరుసటిదిన ముదయము దాసుగణు నిద్రనుంచి లేవగనే యొక బీదపిల్ల చక్కనిపాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము యెఱ్ఱచీర వర్ణనము. అది చాల బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండెననియు దాని యంచులు చివరలు చాల సుందరముగా నుండెననియు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల, ఆమె చింకిగుడ్డను కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము ఆమె సంతోషభావమును గాంచి, దాసుగణు ఆమెపై జాలిగొనెను. ఆమరుసటిదినము రావు బహద్దర్ యమ్. వి. ప్రధాన్ తనకు దోవతులచావు లివ్వగ, ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావుబహద్దుర్ యొక మంచి చిన్న చీరను కొని యామెకు బహుకరించెను. ఆకలితో నున్నవారికి విందు భోజనము దొరికినట్లు ఆమె యమితానందపరవశురాలయ్యెను. ఆ మరుసటిదిన మామె యా క్రొత్తచీరను ధరించెను. సంతసముతో తక్కిన పిల్లలతో గిర్రున తిరుగుచు నాట్యము చేసెను. అందరికంటె తాను బాగుగ ఆడి పాడెను. మరుసటిదినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకిబట్ట కట్టుకొని వచ్చెనుగాని యామె యానందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసుగణు జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్తచీర గలదు, గాని, దానిని పెట్టెలో దాచు కొనెను. అయినప్పటికి విచారమనునది గాని, నిరాశ యనునదిగాని లేక యాడుచు పాడుచుండెను. కాబట్టి కష్టసుఃఖములను మనోభావములు మన మనోవైఖరిపై నాధారపడి యుండునని అతడు గ్రహించెను. ఈ విషయమునుగూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతు డిచ్చినదానితో మనము సంతసింపవలెను. భగవంతుడు మనల నన్ని దిశలనుండి కాపాడిమనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించిన దంతయు మన మేలుకొరకే యని గ్రహించెను. ఈ ప్రత్యేకవిషయములో ఆ పిల్లయొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్తచీర, దాని నిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము - ఇవి యన్నయు భగవంతుని యంశములే. భగవంతుడు ఈయన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచట దాసుగణు ఉపనిషత్తులలోని నీతిని, అనగా ఉన్న దానితో సంతుష్టిచెందుట, ఏది మనకు సంభవించుచున్నదో - యది యెల్లయు భగవంతుని యాజ్ఞచే జరుగుచున్న దనియు, తుదకది మన మేలుకొరకేయనియు గ్రహించెను.

Пікірлер
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 24 МЛН
Sai devotee Sri b.v Narasimha swami
13:51
Sri sai divya charanalu
Рет қаралды 141
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН