Рет қаралды 63,053
#raitunestham #livestockfarming #gorrepottellu #raitunestham #గొర్రెలపెంపకం
వ్యవసాయ అనుబంధ రంగమైన గొర్రెల పెంపకం రైతులకి అదనపు ఆదాయం.. నిరుద్యోగ యువతికి ఉపాధినిచ్చే వేదికగా అద్భుత అవకాశాలు అందిస్తోంది. పెంపకంపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ను చేపట్టి... గొర్రెల పెంపకానికి రూ. కోటి వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది రైతులకి ఈ స్కీమ్ పై అవగాహన కల్పించి.. గొర్రెల పెంపకంలో పూర్తి సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డి.హుస్నాపూర్ గ్రామంలో ఎన్ఎల్ఎం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు, యువకులు, ఔత్సాహికులకి గొర్రెల పెంపకంపై శిక్షణ ఇస్తోంది. వసతి, భోజన సదుపాయంతో 3 రోజుల పాటు జీవాల పెంపకం, యాజమాన్యం, ఆరోగ్య రక్షణ, దాణా, సహజ విధానాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది.
మరింత సమాచారం కోసం డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి గారిని 98495 86874 లో సంప్రదించగలరు.
-------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • డెంగ్యూ, మలేరియా.. పంట...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham