సత్యం ధర్మం సమాజ సేవ ఈ మూడు సంధ్యావందనం చేసే వాళ్ళ ఆస్థులు!!

  Рет қаралды 3,716

K C Das Memorial Charitable Trust

K C Das Memorial Charitable Trust

Күн бұрын

సకాలంలో సంధ్యావందనం యొక్క విశిష్టత, మన సంస్థ సభ్యులు శ్రీ మిర్తిపాటి వెంకటరామయ్య గారి అనుభవములో.....*🙏🏽
శ్రీ గాయత్ర్యైనమః
లోకకళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం మన సంస్థ సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి గత పుష్కర కాలంగా ప్రతి నెలా ఒక ఉచిత సంధ్యావందన శిక్షణ శిబిరం ద్వారా సుమారు 18 వేల మందికి ఉచితంగా గురుముఖతః ముద్రాసహితంగా సంధ్యావందనం నేర్చుకుని ఆచరించి తరించే విధంగా కృషి చేస్తూ, ప్రస్తుతం 150 వ ఉచిత ఆన్లైన్ శిక్షణ శిబిరం నిర్వహించడం సంస్థకే కాకుండా బ్రాహ్మణ సమాజానికే గర్వకారణం.
గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామ చంద్ర మూర్తి గారికి కృతజ్ఞతా పూర్వక పాదాభివందనాలు.
నిన్న 150 శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం సందర్భంగా, అందరికీ సుపరిచితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శి, తితిదే మాజీ కార్యనిర్వహణ అధికారి, గొప్ప ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా వారి అమూల్యమైన సందేశం ఇస్తూ..... ఒక విషయం ప్రస్తావించడం జరిగింది...
ఒకానొక సందర్భంలో జగద్గురువుల వద్ద 'గ్రహదోషాలు, వాటి పరిహారాలు' విషయంపై చర్చలో సంధర్బంగా... జగద్గురువులు -
'ప్రతిరోజూ బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, సూర్యోదయానికి ముందే సంధ్యావందనం ముగించే వారికి ఎటువంటి గ్రహదోషాలు అంటవని, చెప్పారని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా, ఇదే విషయంలో నా స్వానుభవం మీతో పంచుకోవాలని:
2018 వ సంవత్సరంలో నేను అనేకానేక ఇబ్బందులతో విపరీతమైన నిరాశకు లోనయ్యాను.
1. నా భార్య ఆరోగ్యం బాగా క్షీణించి, తాను ఇక దక్కదు అనే పరిస్థితి, (అప్పటి మన సంస్థ సభ్యులందరికీ బాగా తెలుసు)
2. ఒక వ్యక్తికి కేవలం మాటే ఆధారంగా 18 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేసాను. వారు మంచివారు, సమర్ధులు అయినా, తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
3. నేను జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న కంపెనీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వలన నేను వ్యక్తిగతంగా కూడా కొన్ని న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్నాను.
ఇటువంటి విషమ పరిస్థితిలో కూడా, సంస్థ కార్యక్రమాలలో ఆ జగన్మాత అనుగ్రహంతో మామూలుగా పాల్గొనే వాడిని.
నేను వాస్తవమే చెపుతున్నా...
ఒకరోజు యథాలాపంగా శ్రీ గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామ చంద్ర మూర్తి గారి వద్ద పై విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.
వెంటనే
శ్రీ గురుదేవులు:
'మీరు ప్రాతః సంధ్యావందనం ఎన్ని గంటలకు చేస్తారు' అని అడిగారు.
'మార్నింగ్ వాక్ కి వెళ్లి వచ్చి సుమారు 06.30-07.00 మధ్యన ఆచరిస్తాను' అని చెప్పా.
వారు *'రేపటి నుంచి సూర్యోదయానికి ముందే ఆచరించండి మీ సమస్యలనుంచి మీకు ఉపసమనం ఉంటుంది'*, అని సూచించారు.
వారి సూచన, నాకు ఆదేశం... శిరోధార్యం... నేను ఆ విధంగా ఆచరించడం ప్రారంభించి, ఈరోజుకి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆచరిస్తున్నా.
కేవలం 30-45 రోజుల వ్యవధిలో, నా భార్య ఆరోగ్యం కుదుట పడింది, నాకు రావలసిన సొమ్ము వడ్డీతో తిరిగి పొందాను, న్యాయపరమైన ఇబ్బందులు తొలగి... 2020 లో పదవీ విరమణ చేసి... ఇప్పుడు మా స్వగ్రామంలో ప్రశాంతంగా ఉంటూ, సంస్థ కార్యక్రమాలలో నా 69 వ ఏట కూడా చురుకుగా పాల్గొంటున్నాను.
ఇప్పుటి నా సుఖ సంతోషాలకు శ్రీ గురుదేవుల ఆనాటి సూచనే కారణమని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను.
నేను వాస్తవమే చెపుతున్నా, మన సభ్యులకు కొంతమందికి ఈ విషయం గతంలోనే తెలుసు.
నా జీవితమే సకాల సంధ్యోపాస సద్యోఫలితానికి ప్రత్యక్ష నిదర్శనం.
మా భార్యాభర్తల ఇరువురి దృష్టిలో 'శ్రీ గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామ చంద్ర మూర్తి గారికి', గాయత్రీ మాతకు తేడా లేదు'.
సదా శ్రీ గాయత్రీ మాత సేవలో..
వేంకట రామయ్య మిర్తిపాటి.
ముంగండ గ్రామం.

Пікірлер: 22
@pvnagaraju1971
@pvnagaraju1971 3 ай бұрын
Well Expression Sir
@arunakumarch5846
@arunakumarch5846 3 ай бұрын
శ్రీ గాయత్య్రైనమః. శ్రీ గురుభ్యోనమః. 🌼🌼🌼👏👏👏
@PNBSSrinivas
@PNBSSrinivas 3 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@sasibhushankakani8974
@sasibhushankakani8974 3 ай бұрын
Sree Gayatriye Namaha. 🙏 Sree Gurubhyo Namaha. 🙏
@harinarayanareddyjonnala131
@harinarayanareddyjonnala131 3 ай бұрын
Sandhyavandanamcheyatamuttamamainadekaniippudusandhyavandanamchesevalluentamanddiunnaroganitamveinchandi
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 3 ай бұрын
సత్యం ,పరం, ధీమహీ. .. జంతు నాం నరజన్మ ధుర్లభం
@c.venkateswarasarma6750
@c.venkateswarasarma6750 3 ай бұрын
🙏🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 ай бұрын
సార్, నమస్కారం.సనాతన ధర్మాలు అంటే ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను.అలాగే సంధ్యావందనం ఎందుకు చేయాలి? ఉపయోగం ఏమిటి? భగవద్గీతలో సంధ్యావందనం గురించి చెప్పారా? భగవద్గీతా జ్ఞానం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? వివరించాలని మనవి చేస్తున్నాను సర్
@dnarasimhamurthy2039
@dnarasimhamurthy2039 3 ай бұрын
ఉన్నత విద్యావంతులైన గురువు గారికి నా హృదయపూర్వకవందనాలు..... బ్రాహ్మణ తత్త్వం గురించి చాలా చక్కగా ఆచరణ యోగ్యంగా వివరించారు.. గురువు గారూ ఈ సంధ్యావందనం అన్నది ఒక్క బ్రాహ్మణులకేనా? ఇతరులకు అవకాశం లేదా? ఇతరులకు కూడా అవకాశం వుంటే ఎవరి ద్వారా నేర్వవచ్చును.... సూచించగలరు....
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 3 ай бұрын
బ్రాహ్మణ,క్షత్రియ, వాశ్య లకు వేద పద్ధతి ఇతరులకు పౌరాణిక పద్ధతి ఉన్నది
@KCDTADMIN
@KCDTADMIN 3 ай бұрын
Sree Gurubhyo Namaha. 🙏
@ramasarma6543
@ramasarma6543 3 ай бұрын
sat GURUBHYO NAMAHA🙏
@annadanammallikarjuna9089
@annadanammallikarjuna9089 3 ай бұрын
OM👑🙏
@balijepalliumashankar9967
@balijepalliumashankar9967 3 ай бұрын
గురువు గారు సంధ్యా వందనం పూర్తి అయన తర్వాత మిగిలిన నీరు తులసి మొక్క కి పోయ వచ్చా
@krishnachaitanya8296
@krishnachaitanya8296 3 ай бұрын
poya vachu kani achamanam lo neeru veruga Patra pettali aa neru bayata ekkadyna poyochu Arghyam vidichina neeru tulasilo poyochu
@cvenkat7766
@cvenkat7766 3 ай бұрын
సంధ్యా వందనం పూర్వం హైందవ సమాజం లో అందరూ చేసే వారు . కాలం లో వచ్చిన మార్పులను బట్టి కొన్ని వర్గాలు ఆ ఆచారాన్ని వదులుకున్నాయి . దయచేసి ఇటువంటి విషయాలను కుల పరంగా చూడ వద్దు . ఓ వర్గం వారిని గొప్పగా చిత్రించే ప్రయత్నం చేయ వద్దని మనవి .
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 3 ай бұрын
చేసేవారిని గొప్పగా చూస్తే తప్పు ఏమిటి బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలు చేస్తాయి మిగిలిన వాళ్ళకి అవసరం లేదు సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు అన్నారు కష్టపడి వ్యవసాయం చేస్తారు కాబట్టి లేదు చేస్తాను అంతే పౌరాణిక పద్ధతి ఉన్నది
@r.r.raagavendhrra2462
@r.r.raagavendhrra2462 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sasibhushankakani8974
@sasibhushankakani8974 3 ай бұрын
Sree Gayatriye Namaha. ,,
@adirajuvenkataramaiah4385
@adirajuvenkataramaiah4385 3 ай бұрын
ఓంశ్రీగాయత్ర్యైనమఃఓంశ్రీగురుభ్యోనమః🙏
@KCDTADMIN
@KCDTADMIN 3 ай бұрын
Sree Gayatriye Namaha. 🙏
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,7 МЛН
Sandhyavandanam - Why is it important!
20:55
RigVeda Adhyayanam
Рет қаралды 2,2 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33