తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని తెలుసుకోలేరు.చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది. దూరంగా వెళ్ళిపోయినా వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా వున్న శిష్యునికి విద్యనూ బోదించగలడు గాని, దూరంగా వెళ్ళిపోయినా వారికి బోధలు చెయ్యలేరు. జ్ఞానాన్ని సంపాదించ దలచిన వారు గురువుకి దగ్గరగా వుండాలి మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి వుంటుంది .. అదేవిధంగా మనం మాట్లాడే శక్తి లోను గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఎ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందు వలన గురువు లేనిదే ఎ శక్తీ లేదు ..
@vamsitelecomltdlondon5009 жыл бұрын
భూమి అంతయూ కాగితము చేసి, మొత్తము అడవుల్లోని కర్రని కలముగా చేసి, ఏడు సముద్రాల్ని ఇంకుగా చేసిన సరే గురువు యొక్క గుణాల్ని వ్రాయలేము. గురువు యొక్క మహిమ అనంతం. గురువు యొక్క జ్ఞానం అమూల్యమైనది. అందుచేత గురువు యొక్క గుణాల్ని ఎన్నని వ్రాయగల్గుతాము? ఎప్పటివరకు మనకు గురువు యొక్క జ్ఞానము లభించదో అప్పటి వరకు ఈ సంసారిక బంధనాలను నుంచి ముక్తి పొందలేము . ఈ మాట సత్య ప్రామాణికమైనది. జ్ఞానం కోసం సద్గురువు యొక్క అమృతమయమైన సదుపదేశ ప్రవచనం వినాలి. సత్య సాక్షాత్కారము కోసం శిష్యులకు సద్గురువే ఆధారము. కోటి సూర్యులు ఉదయించిన, కోటి చంద్రులు ఉదయించిన ఆ ప్రకాశము తో అజ్ఞాన రూపి అయిన అంధకారము పోదు. చంద్రుని వల్ల , సూర్యుని వల్ల బాహ్య ప్రపంచానికి వెలుగు దొరుకుతుంది. కాని గురువు యొక్క సమ్యక జ్ఞానము వల్ల హృదయములో ఉన్న అంధకారము పోతుంది. సలాది సత్యకృష్ణ ( లండన్ )