🎻🌹🙏 మనం చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం ఏ రూపంలో ప్రకటించబడుతుంది...???*.. 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌷👉 *పుణ్యం ఎలా ప్రకటించబడుతుంది...!?* 🌷👉ఈశ్వరుఁడు మంచి నైపుణ్యం గల వ్యవసాయదారుడు...!!! *మొదలు మన మనస్సు అనే నేలను సాధన అనే నాగలితో దున్ని ఆ తరువాత పుణ్యం అనే విత్తును నాటుతాడు తద్వారా తన కటాక్షవీక్షణాలనే ఫలాలను అందిస్తాడు...!!!* 🌷👉పుణ్యం అనేది ఫలం కాదు , పుణ్యం అనేది సత్ఫలానికి కారణం...!!! *పుణ్యం అనేది విత్తనమైతే* *మనసులో కలుగుతున్న మంచి మార్పు ఎదుగుతున్న వృక్షం లాంటిది.* *అలా మారిన మనసు అందుకునే భగవంతుడి వాత్సల్యానుభూతియే వృక్షానికి పండిన ఫలం...!!!* 🌷👉మనం చేసిన ధర్మకార్యం ఫలించిందాలేదా అనే సందేహాన్ని మన మనస్సే నివృత్తి చేస్తుంది...!!! *సన్మార్గం దిశగా ప్రయాణిస్తున్న మన మనస్సే చెబుతుంది మనం గెలిచామని...!!!* *ఈ మంచి మార్పే క్రమేపీ సాధకుడిని మహనీయుడిగా మారుస్తుంది...!!!* 🌷👉 *పూజలు ,పారాయణాలు, దీక్షలు, జపాది ఇత్యాదులు సిద్ధించుకున్న సాధకుడిలో అప్రయత్నంగానే* *"క్షమా, సహనం , సామరస్యం, భూతదయ, ప్రేమ, దైవిక జ్ఞానం ఇలాంటి సుగుణాలు పెంపొందించబడతాయి...!!!* 👉ఇదియే నిజమయిన సాధన...!!! 🌷👉 *కోటి పూజలు చేసినా, లక్ష పారాయణాలు చేసినా, వేల జపాలు చేసినా గోరంత కూడా మనలో మంచి మార్పు రాలేదంటే, ఆ సాధన బండరాయి మీద నాటిన విత్తనం లాంటిదే...!!!* 🌷👉 *పుణ్యానికి మన మనస్సే గమ్యస్థానం. మనసులో వచ్చే మార్పే జీవితాన్ని మారుస్తుంది...!!!* మట్టి బెడ్డలోనుండి వచ్చే సువాసనకు వర్షపు చినుకు కారణమైనట్లు , మన మనస్సులోని సుగుణాల వెలికితీతకు చేసిన ధర్మకార్యాల పుణ్యమే కారణం...!!! 🌷👉 *రాజు యొక్క రాకను తెలియపరిచి సభలోని వారిని క్రమశిక్షణలో పెట్టిన బంటు మాదిరి , భగవదనుగ్రహం వచ్చేముందు ఆవశ్యకమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణను మనసుకు అలవాటు చేసేదే పుణ్యం...!!!* 🌷👉అందుకే మనం చేసిన పూజలకు పారాయణాలకు జపాలకు వచ్చే పుణ్యం సాధకుడి మనసును సారవంతం చేసి తనను తాను ప్రకటించుకుంటుంది...!!! 🌷👉కొబ్బరికాయలు కొట్టి, కాయకొక కోరికచొప్పున "కోరికల దండకాలు" చదివే బదులు *ఫలాపేక్ష లేకుండా పరంధాముడిని ధ్యానిస్తే /పూజిస్తే పుణ్యాన్ని ప్రసాదించి మన మనస్సునే వైకుంఠంగా చేసుకుంటాడు...!!!*🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
@anweshgudepu4 жыл бұрын
✨😍💖 Om Namo Shri Venkateshaya 😍💖💖💖🙏🏻🙏🏻🙏🏻✨ My Govinda 😍😘💖💖🙏🏻
Channel owners please idhi playlist cheyandi. Mi daggara unna Venkateswara swamy videos and anni pravachanams order lo pettandi. Half petti tiseyaddu. At least part 1, 2 ala pettandi.