Рет қаралды 934
వనపర్తి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రావుల గిరిధర్ మంచి పోలీసు అధికారిగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. వనపర్తి ప్రజల హృదయాలలో ఆయన సుస్థిర చోటు దక్కించుకున్నారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే, కేసుల సత్వర పరిష్కారానికి కోసం కృషి చేస్తున్నారు. ప్రజల్లో సౌముడిగా పేరు తెచ్చుకున్న ఆయన తన కింది సిబ్బందితో స్నేహంగా ఉంటూ లా అండ్ ఆర్డర్ ను గాడి తప్పకుండా అప్రమత్తం చేస్తున్నారు. స్వతహాగా కవి అయిన ఎస్పీ రావుల గిరిధర్ పురాతన సంస్థానం అయిన వనపర్తి జిల్లాలో ఎస్పీగా తాను పనిచేయటం ఎంతో సంతృప్తిని ఇస్తున్నదని అంటున్నారు. ఉధ్యోగ పరంగానే కాకుండా ఇక్కడి మనుషులు వారి మమతలు తనకు కొత్త బలాన్ని ఇచ్చాయని చెబుతున్నారు. 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జిల్లా ప్రజలకు, ఇక్కడి ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.అదేవిదంగా ప్రజల కోసం,ప్రజల పక్షం పని చేస్తున్న టీజీ నైన్ చానల్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.