క్రైస్తవ్యం మతం కాదు ఆధ్యాత్మిక విప్లవం క్రీస్తు యేసు వ్యక్తి కాదు మహా శక్తి స్వరూపం మతమే కాదు అతని బోధ హితమనీ అజ్ఞానపు చీకట్లను తొలగించే దీపమనీ నది ఒడ్డున మలినముంటే నీటిని నిందిస్తారా క్రైస్తవ్యంలో చీడపడితే ప్రభువును ద్వేషిస్తారా ఎవరు నమ్మినా నమ్మకున్నా సత్యమిదే నిత్యమిదే జరగబోవు వాస్తవమ్మిదే మట్టికట్టె ఎదుర్కొనే పరమ భవిత ప్రవచనమ్మిదే మానవ దేహాలకుంది మహిమ రూపము నిరీక్షణతో ఎదురు చూస్తే నిత్యజీవము కళ్ళ ముందు కనబడేది శిథిలమైపోయినా కనిపించని దేహముంది నీ కొరకై పరమున ఆదాము నుండి వచ్చిన ఈ దేహం మరణము వలన మట్టికి చేరుతున్నది ఆ యేసు సజీవుడై తెచ్చిన ఆ దేహం మరణము గెలిచి పరముకు చేరుకున్నది దృశ్యమైనవన్నీ అనిత్యం అశాశ్వతం అదృశ్యమైనవే కలకాలం నీ వశం కడబూర మ్రోగగానే కనురెప్ప పాటులోనే తెరువబడును సమాధులు తిరిగి బ్రతుకుతారు మృతులు ఈ దేహమందు దేవుని చిత్తమును జరిగించిన వారికి పరలోకప్రాప్తము ఈ లోకమందు దుష్టులభీష్టమును నెరవేర్చినవారికే నరకమే తధ్యము మేలు చేసినోళ్లకే జీవపునరుత్థానము కీడు వలన దొరికేది తీర్పు పునరుత్థానము క్షయమైనది విత్తబడి అక్షయముగా లేపబడి మారుతుంది ఆకారం మహిమ దేహ సాకారం