Dear brothers మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే నరకమంటే ``మనుషులను అగ్నిలో వేసి కాల్చేటటువంటి స్థలం కాదు'' మీరు బైబిల్ నీ బాగా చదవండి మన దేవుడు ఎలాంటి వాడు అనేది మీరు బాగా తెలుసుకోవాలి ``మన దేవుడు ప్రేమా మయుడు అయన కోపము నిముషం మాత్రం ముండును, అయన దయ ఆయుష్కాలాముండును' మానవులు తప్పు చేస్తే వాళ్ళని అగ్నిలో వేసి కాలుస్తుంటే వాళ్ళు పడే బాధను చూసి సంతోషించు వాడా మన దేవుడు.? ఆలా ఉన్నప్పుడు తనకున్న ఒకే ఒక కుమారుని ఈ భూమికి పంపించి ప్రజలందరి కొరకు విమోచనక్రయదనముగా ఎందుకు బలి ఇవ్వాలి.? ఒక సారి ఆలోచించండి.. నరకమనే పదానికి అర్థము ఒరిజినల్ భాష అయినటువంటి గ్రీకు, హెబ్రులో దీని అర్థం చాలా చక్కగా వుంది. గ్రీకుభాషలో నరకం అంటే. 1. షియొల్ 2. హెడేస్ అని వస్తుంది 1.షియొల్ అంటే - సమాధి అని అర్థం 2. హెడేస్ అంటే - పాటిపెట్టు స్థలము అని అర్థం గ్రీకులో నరకమంటే. 1. టార్ టరో 2. గేహేన్నా అని వస్తుంది. 1.టార్ టరో అంటే - పాపం చేసినటువంటి దేవధూతలను భంధించే స్థలం దానినే ( కటిక చీకటి గల బిలము ) అని అంటారు. 2. గేహెన్నా అంటే - అగ్ని గుండము అంటే పనికి రాని చేత్తను కాల్చే స్థలము. అని నరకమనే పదానికి పై విధంగా అర్థాలు వస్తాయి కాబట్టి మీరు బైబిల్ ని బాగా చదవండి ఊరికే ఏదేదో చదివి `దేవుని' నామాన్ని వ్యర్తంగా ధూసించే విధంగా చేయవద్దు అని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻