ఎంత చక్కని అచల బోధమ్మా...... అమ్మమ్మ దీని అంతు తెలిపితే చింత లేదమ్మా..... ఎంత చక్కని అచల బోధ చింతల అన్నది లేక యున్నది రంతు చేసేటి మాయ యరుకను అంతము నోoదించి వేసి. *ఎంత* ఆగమ సంచితము బాయమ్మ....... ప్రారబ్ద కర్మ రాగద్వేషాలు వదిలి పాయ మ్మమా....... ఆగమ నిగమము లెన్ని చూసిన యుగయుగముల కు తెలియరాని ది బాగుగ సద్గురుని నమ్మిన త్యాగ లకు వశమైన పదవిది. *ఎంత* మేలు మేమియు లేదు గదవమ్మా....... కలకాల మంతయు కలవరింతలు ఆయే గదనమ్మా.... చాలు చాలు మాయ యరుక జాలమే కదా జాడ లేనిది చాలగా గురు వాక్యమoడి కీల రింగితే మేలు గలిగేటీ *ఎంత* వట్టి జగమని వాంఛ విడు వమ్మా....... బూటకము భాషితే వాటమైన బాట గదవమ్మా......... అట్టి దిట్ట దన గా రాకను పుట్టు గిట్టులు మాయ జేసి మట్టు మీరి మెలుగు చుండె బట్టబయలు నిజము ఆయెను. *ఎంత* పరమ పావనమైన పదవమ్మా...... నిరతంబు నీవు మరువకా స్మరియింపు చుందమ్మా..... ధరణి అప రెడ్డి పల్లె యందున గురువు లక్ష్మణ ప్రభువరుండును వరద రామ దాసరమాని కోరి తెలిసిన పరమ పదవి. *ఎంత*